EntertainmentSatya Sri Jabardasth ఏంటీ..! పెద్దరాయుడులో బ్రహ్మానందం...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Satya Sri Jabardasth ఏంటీ..! పెద్దరాయుడులో బ్రహ్మానందం భార్య.. ఈ ఫెమస్ జబర్దస్త్ నటి అమ్మా..!!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Satya Sri Jabardasth హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఎన్నో వందల సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.  ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ప్రేక్షకులు పడీపడీ నవ్వుతారు. ఎన్నో సినిమాల్లో ఆయన వైవిధ్యమైన పాత్రలు వేసి ప్రేక్షకులను గిలిగింతలు పెట్టి నవ్వించారు. బ్రహ్మానందం గారి కామెడీ గురించి చెప్పాలంటే ఒకటో.. రెండో సినిమాలు చెప్తే సరిపోదు. ఆయన నటించిన సినిమాలన్నీ చెప్పాలి.. సినిమా సినిమాకు ఆయన తన కామెడీతో ఆకట్టుకున్నారు. అలాగే కలక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమాల్లో బ్రహ్మానందం కామెడీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేది. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు, సీన్స్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసేవారు. ముఖ్యంగా పెద్దరాయుడు సినిమా గురించి చెప్పుకోవాలి. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

Satya Sri Jabardasth

ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. రజినీకాంత్ ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించారు. అలాగే మోహన్ బాబు ఈ మూవీలో డ్యూయల్ రోల్ లో కనిపించి మెప్పించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఓ సన్నివేశంలో బ్రహ్మానందం తాను ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని తన తండ్రి దగ్గరకు వచ్చే సీన్ బాగా పండింది.

ఈ సీన్ లో బ్రహ్మానందం భార్యగా నటించిన నటి గుర్తుందా.? ఆమె ఎవరో కాదు జబర్దస్త్ లేడీ కమెడియన్ సత్య శ్రీ తల్లి. సత్య శ్రీ జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. చమ్మక్ చంద్ర స్కిట్స్‌లో నటిస్తూ తన కామెడీతో ప్రేక్షకులను నవ్వుస్తుంది. ఆ మధ్య జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసింది. ఆతర్వాత తిరిగి జబర్దస్త్ లోకి వచ్చి ప్రస్తుతం బుల్లెట్ భాస్కర్ టీంలో చేస్తోంది. సత్య శ్రీ తల్లి పెద్దరాయుడు సినిమాతో పాటు ఇష్క్, ఆర్య 2 సినిమాల్లోనూ నటించింది. ఇక కూతురి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆమె సినిమాలు మానేసింది. ఈ విషయాన్నీ ఓ ఇంటర్వ్యూలో  సత్య శ్రీ తెలిపింది. ఇక సత్య శ్రీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

సత్య శ్రీ సోషల్ మీడియా

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this