Sunday, June 1, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Eggs in Summer : ఎండాకాలంలో గుడ్లు...

AP Teacher Transfers 2025 FAQs

AP Teacher Transfers 2025 FAQs మరియు వాటి సమాధానాలు ఇక్కడ...

Teacher Transfers 2025: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన...

విద్యారంగంలో నవశకం: Andhra Pradesh Teacher Transfers 2025 – ఉపాధ్యాయులకు గొప్ప ఊరట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. 2025...

iQOO Neo 10: 120W ఫాస్ట్ ఛార్జింగ్, 7000mAh బ్యాటరీతో భారత్‌లో లాంఛ్ – ధర, ఫీచర్లు ఇవే!

iQOO Neo 10 భారత్ మార్కెట్‌లో మే 26న లాంఛ్ కానుంది....

Eggs in Summer : ఎండాకాలంలో గుడ్లు తినడం మంచిదేనా ?.. తింటే ఎన్ని తినాలి? ఇదిగో క్లారిటీ

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 వేసవిలో గుడ్డు తింటే వేడి చేస్తుందని చాలామంది అంటుంటారు.. ఇది ఎంతవరకు నిజం.. ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం పదండి.

Eggs in Summer : ఎండాకాలంలో గుడ్లు తినడం మంచిదేనా ?.. తింటే ఎన్ని తినాలి? ఇదిగో క్లారిటీ

Health Tips: శరీరానికి గుడ్లు ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు.. ఇవన్నీ కోడిగుడ్డులో పుష్కలంగా లభిస్తాయి. ప్రతిరోజూ గుడ్లు తింటే శరీరంలో ప్రొటిన్స్ పెరుగుతాయి. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. ఇందులో కాల్షియం, ఐరన్ 90 శాతం ఉంటుంది. అలాగే గుడ్డులో ఉండే పచ్చసోన, తెల్లటి పోరలో అత్యధికంగా ప్రోటీన్ శాతం ఉంటుంది. అందుకే గుడ్లను పోషకాహర నిధిగా పిలుస్తారు. ఇలా ఎన్నో రకాల పోషకాలు కలిగిన చవకైనది ఎగ్ మాత్రమే. కొంతమంది ఉడకబెట్టిన గుడ్లను తినడానికి ఇష్టపడతారు. మరికొంత మంది ఎగ్ పుడ్డింగ్ చేసి తింటారు. అదే సమయంలో, కొంతమంది బ్రెడ్‌తో ఆమ్లెట్ తినడానికి ఇష్టపడతారు. గుడ్డు ప్రోటీన్ల నిధి అని పెద్దలు చెబుతారు.

ఉడికించిన కోడిగుడ్డు నుంచి మన శరీరానికి అందే పోషకాల శాతం ఎంతో మీకు తెలుసా?

  • ఫోలేట్ – 5 శాతం
  • సెలీనియం – 22 శాతం
  • ఫాస్ఫరస్ – 9 శాతం
  • విటమిన్ ఎ – 6 శాతం
  • విటమిన్ బి2 – 15 శాతం
  • విటమిన్ బి5 – 7 శాతం
  • విటమిన్ బి12 – 9 శాతం

అయితే ఇన్ని పోషకాలున్న గుడ్లను వేసవి కాలంలో తినోచ్చా లేదా..?

చాలామందికి ఎండాకాలంలో గుడ్లను తింటే అనారోగ్యానికి గురవుతామనే డౌట్ ఉంటుంది. గుడ్లు వేడిని కలిగిస్తాయని, వీటిని తింటే మొటిమలు, కడుపు రుగ్మతలు వస్తాయని అంటుంటారు. అయితే నిపుణులు… వేసవికాలంలో గుడ్లను మితంగా తినాలని చెబుతున్నారు. గుడ్లు వేడిని ఉత్పత్తి చేసే ధోరణిని కలిగి ఉంటాయి. అతిగా తింటేనే ఇబ్బంది ఉంటుంది.  రెండు కంటే ఎక్కువ గుడ్లను తింటేనే ఒంట్లో వేడి ఎక్కువవుతుంది. కాబట్టి ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ఎంచక్కా రోజుకు రెండు గుడ్లను తినండి. అప్పుడే ఈ ఎండాకాలం ఆరోగ్యంగా ఉంటారు. గుడ్డును ఏ సీజన్ లోనైనా తినొచ్చు కానీ సమ్మర్‌లో తక్కువగా తీసుకోవాలని గుర్తుంచుకోవాలి.

Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

eggs in summer : ఎండాకాలంలో గుడ్లు తినడం మంచిదేనా ?.. తింటే ఎన్ని తినాలి? ఇదిగో క్లారిటీ

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this