Tuesday, January 27, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
EntertainmentCinemaSri Leela Conditions శ్రీలీల కొత్త కండీషన్.....

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) 2025: సంపూర్ణ మార్గదర్శకాలు

పరిచయం:ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం, రాష్ట్రంలో తరగతి 1 నుండి 8 వరకు ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలనుకునే...

Sri Leela Conditions శ్రీలీల కొత్త కండీషన్.. స్టార్ హీరోకైనా నో చెప్పేస్తుందట!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

Sri Leela Conditions  టాలీవుడ్ లోకి రాకెట్ వేగంతో దూసుకొచ్చింది ఈ యంగ్ బ్యూటీ. శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు కొట్టేసింది. మాస్ మహరాజ రవితేజతో ‘ధమాకా’ లాంటి బ్లాక్ బస్టర్  అందించింది. ఆ తర్వాత కూడా ఎక్కడా ఆగకుండా వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ పరిశ్రమలో ఛార్మింగ్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. అయితే గుంటూరు కారం తర్వాత మాత్రం ఈ అమ్మడు కాస్త దూకుడు తగ్గించిందనే చెప్పాలి. పైగా ఇప్పుడు కొత్త కండీషన్ కూడా పెడుతున్నట్లు టాక్. ఆ కండీషన్ కు ఒప్పుకోకపోతే.. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా రిజెక్ట్ చేస్తుందట.

Sri Leela Conditions

శ్రీలీల.. అందం, అభినయం, డ్యాన్స్ ఈ మూడు విషయాల్లో బెస్ట్. ధమాకాలో ఆమె చేసిన డ్యాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా విడుదల కాకముందే ఈ అమ్మడి చేతుల్లో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ఆదికేశవ, ఎక్స్ ట్రార్డినరీ మెన్, భగవంత్ కేసరి, గుంటూరు కారం లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం నితిన్ తో ఓ మూవీ చేస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ లో చేస్తోంది. ఈ రెండు చిత్రాలు తప్పితే.. మరే సినిమాలు ఆమె చేతుల్లో లేవు. దానికి ఓ బలమైన కారణం ఉంది.

కొత్త సినిమాలను ఒప్పుకునే క్రమంలో ఓ కండీషన్ పెడుతోందట శ్రీలీల. అదేంటంటే? సినిమాలో సోలో హీరోయిన్ అయితేనే ఆ ప్రాజెక్ట్ కు ఒకే చెబుతోందట. లేకుంటే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా రిజెక్ట్ చేస్తోందట. తాజాగా కార్తీ సర్దార్ 2లో నటించనని సున్నితంగా చెప్పేసిందట ఈ బ్యూటీ. దీంతో పాటుగా ఓ బాలీవుడ్ మూవీని కూడా రిజెక్ట్ చేసిందని టాక్. సోలో హీరోయిన్ అయితేనే చేస్తానని మేకర్స్ కు సరికొత్త కండీషన్ పెట్టిందట ఈ చిన్నది. అందుకే ఈ బ్యూటీ చేతుల్లో మునపటిలా సినిమాలు ఉండటం లేదు. మరి ఈ కండీషన్ తో ఇండస్ట్రీలో ఎలా నెట్టుకొస్తుందా? అని అభిమానులు, సినీ పండితులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి శ్రీలీల కండీషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this