RBI News: క్రెడిట్ కార్డుల విషయంలో RBI...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

RBI News: క్రెడిట్ కార్డుల విషయంలో RBI కీలక ఆదేశాలు.. ఇకపై అలా చేస్తే భారీ జరిమానాలు.. కస్టమర్లకు ఊరట

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 RBI News: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై వాటిని అతిక్రమించిస్తే భారీగా జరిమానాలు తప్పవని హెచ్చరించింది. వినియోగదారులకు కొత్త రూల్స్ ఊరటను కల్పించనున్నాయి.

RBI News: క్రెడిట్ కార్డుల విషయంలో RBI కీలక ఆదేశాలు.. ఇకపై అలా చేస్తే భారీ జరిమానాలు.. కస్టమర్లకు ఊరట

RBI News కస్టమర్ల నుంచి స్పష్టమైన సమ్మతి తీసుకోకుండా క్రెడిట్‌ కార్డులు(Credit cards) జారీ చేయటం లేదా కస్టమర్ల ప్రస్తుత కార్డులను అప్‌గ్రేడ్‌ చేయడం లాంటివి చేయవద్దని కార్డ్‌ కంపెనీలను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ రూల్స్ అతిక్రమిస్తే సదరు కంపెనీ కస్టమర్‌కు విధించిన బిల్లుకు రెట్టింపును జరిమానాగా(Penalty) చెల్లించాల్సి ఉంటుందని RBI హెచ్చరించింది. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపుల కోసం కస్టమర్లపై వేధింపులు, బెదిరింపులకు పాల్పడవద్దని కార్డుల సంస్థలు, థర్డ్‌ పార్టీ ఏజెంట్లకు కీలక సూచనలు చేసింది. 2022 జూలై 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి.
కొత్తగా రానున్న రూల్స్ ప్రకారం ఏ కస్టమర్ పేరు మీదైనా అడగకుండానే కార్డు జారీ చేసినట్లయితే.. వారు ఆ విషయాన్ని సదరు కార్డు సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు. కంపెనీ నుంచి సరైన సమాధానం రాకపోతే RBI అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు. ఫిర్యాదుదారుకు కలిగిన నష్టాన్ని సదరు కంపెనీ చెల్లించాల్సిన జరిమానా మెుత్తాన్ని అంబుడ్స్‌మన్‌ నిర్ణయిస్తారు. దీనిని లెక్కించేటప్పుడు సదరు వినియోగదారుడికి వృధా అయిన సమయం, అయిన ఖర్చులు, మానసిక ఆవేదన తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.
రూ. 100 కోట్లకు పైగా నెట్ వర్త్ కలిగిన కమర్షియల్‌ బ్యాంకులు స్వతంత్రంగా లేదా కార్డులు జారీ చేసే ఇతర బ్యాంకులు/NBFCలతో కలిసి క్రెడిట్‌ కార్డు వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. స్పాన్సర్‌ బ్యాంక్‌ లేదా ఇతర బ్యాంకులతో ఒప్పందం ద్వారా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కూడా క్రెడిట్‌ కార్డులను తమ కస్టమర్లకు జారీ చేయవచ్చు. ఆర్‌బీఐ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా NBFCలు .. డెబిట్, క్రెడిట్‌ కార్డులను మొదలైనవి జారీ చేయకూడదు. కార్డు జారీ సంస్థలు, సదరు సంస్థల ఏజెంట్లు.. బకాయిల వసూలు విషయంలో క్రెడిట్‌ కార్డుహోల్డర్ల కుటుంబ సభ్యులు, స్నేహితులపై బెదిరింపులకు, వేధింపులకు పాల్పడకూడదని రిజర్వు బ్యాంక్ తన తాజా ఆదోశాల్లో స్పష్టం చేసింది.

rbi news: క్రెడిట్ కార్డుల విషయంలో rbi కీలక ఆదేశాలు.. ఇకపై అలా చేస్తే భారీ జరిమానాలు.. కస్టమర్లకు ఊరట


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this