Monday, September 29, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
NationalUP Students : క్లాస్‌లో పో*ర్న్ చూసిన...

BMI Calculator (BMI కాలిక్యులేటర్) – మీ BMI Calculate చేసుకుని మీ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోండి

మీ ఆరోగ్యం, మీ ఎత్తు మరియు బరువుకు సరైన సంబంధం ఉందని...

DSC 2025 Web Options: School Head Master Contact Number with DISE Code | DSC School Selection Guide

Head Master Contact : DSC 2025లో ఎంపికైన అభ్యర్థులందరికీ అభినందనలు!...

DSC 2025 New Teachers: MEO Staff Contact Numbers Finder Tool

DSC 2025 లో నియమితులైన అందరు ఉపాధ్యాయులకు హార్థిక అభినందనలు! MEO...

UP Students : క్లాస్‌లో పో*ర్న్ చూసిన విద్యార్థులు..అడ్డుకున్న ప్రిన్సిపల్ ను చితకబాదిన వైనం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

UP Students ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలోని ఓ ఇంటర్‌ కాలేజీలో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి.. కొంతమంది విద్యార్థులు తరగతి గదిలో మొబైల్‌లో పో*ర్న్ చూస్తున్నారు. దీంతో ప్రిన్సిపల్‌ మందలించారు. సెలవుల అనంతరం కొందరు విద్యార్థులు దారిలో చుట్టుముట్టి ప్రిన్సిపల్‌ ను చితక బాది.. డబ్బులు కూడా లాక్కెళ్లారు. బఘౌచ్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహంత్ త్రివేణి పర్వత్ ఇంటర్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

UP Students

అసలేం జరిగిందంటే.. కాలేజీలో ఏడో పీరియడ్‌ సమయంలో క్లాస్‌లోని కొందరు విద్యార్థులు ఇతర బాలికలతో కలిసి ఓ గదిలో కూర్చుని మొబైల్‌లో పోర్న్ వీడియోలు చూస్తున్నారు. ఇది గమనించిన ప్రిన్సిపాల్ విద్యార్థులను మందలించి.. మొబైల్ లాక్కోవడంతో పాటు ఎనిమిదో పీరియడ్‌లో మళ్లీ అలా చేయవద్దని సూచించారు. మొబైల్‌ను తిరిగి ఇచ్చేశారు. అయితే క్లాస్‌ ముగించుకుని ప్రిన్సిపాల్‌ బైక్‌పై ఇంటికి వస్తుండగా ఓ విద్యార్థి తన స్నేహితులతో కలిసి చుట్టుముట్టి కొట్టాడు. అంతే కాదు ఆ విద్యార్థి తనను తుపాకీతో బెదిరించి జేబులోంచి రూ.2200 తీసుకున్నాడని ప్రిన్సిపాల్ ఆరోపించారు. గట్టిగా అరవడంతో స్థానికులు వస్తారని బయపడి నిందితులు అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు.

ప్రిన్సిపాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..

UP Students ఈ కేసులో నిందితుడైన విద్యార్థిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ శశి శేఖర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై బాఘౌచ్‌ఘాట్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి రాజేష్ పాండే మాట్లాడుతూ.. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందిందని, విచారణ జరుపుతున్నామన్నారు. త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

కాగా..UP Students ఈ ఇంటర్ కాలేజ్ బీహార్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంది. కళాశాల నుంచి బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా దూరం కేవలం ఒక కిలోమీటరు మాత్రమే. బీహార్ నుంచి 40 శాతం మంది విద్యార్థులు ఇక్కడకు వచ్చి చదువుకుంటారు. ఈ కళాశాలలో మొత్తం 2800 మంది విద్యార్థులు ఉన్నారు.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this