Science and TechnologyMobileiPhone Wedding Card : వైజాగ్ జంట...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

iPhone Wedding Card : వైజాగ్ జంట వినూత్న ఆలోచన.. ఐఫోన్ పోలిన వెడ్డింగ్ కార్డు.. నెటిజన్లు ఫిదా..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

iPhone Wedding Card : ఇప్పుడు ట్రెండ్ మారింది.. వెడ్డింగ్ కార్డ్ అనేది కేవలం ఇన్విటేషన్ మాత్రమే కాదు.. దంపతుల అభిరుచి, శైలికి ప్రతిబింబం. దంపతుల ప్రత్యేక రోజు గురించి స్నీక్ పీక్. ఇటీవలి సంవత్సరాలలో పెళ్లిళ్ల సమయంలో ఫ్యాన్సీ, కస్టమైజడ్ వెడ్డింగ్ కార్డులు ప్రత్యేకింగా నిలుస్తున్నాయి. చాలామంది వధువరులు తమ వెడ్డింగ్ కార్డు విషయంలో సరికొత్తగా ఆలోచిస్తున్నారు. కాలానికి అనుగుణంగా, విశాఖపట్నంలో ఒక జంట ఐఫోన్ బ్యాక్‌గ్రౌండ్ మాదిరిగా ప్రత్యేకమైన వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డును రూపొందించారు.

iPhone Wedding Card

iPhone Wedding Card లక్ష్మణ్ వెడ్డింగ్ కార్డ్స్ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఆహ్వానానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఐఫోన్‌ను పోలి ఉండేలా రూపొందించిన వినూత్న వెడ్డింగ్ ఇన్విటేషన్ అందరిని ఆకట్టుకుంటోంది. మొత్తం మూడు పేజీలలో బుక్‌లెట్-డిజైన్ లేఅవుట్‌తో రూపొందించారు. కవర్ పేజీలో ఫోన్ వాల్‌పేపర్ మాదిరిగా జంట ఫోటోను ‘బ్యాక్‌గ్రౌండ్’గా కనిపిస్తుంది. ఫొటో పైన వివాహ సమయం, తేదీ వివరాలు ప్రముఖంగా ప్రింట్ చేశారు. ఇన్విటేషన్ లోపల ఉన్న పేజీలలో ఒకటి వాట్సాప్ చాట్ మెసేజ్ ఫార్మాట్ కలిగి ఉంది.

3డీ మాదిరి డిజైన్.. ఐడియా అదుర్స్ :
iPhone Wedding Card “సెండ్ లొకేషన్” క్యాప్షన్, వేదిక వివరాలు ఉన్నాయి. ఇంతలో, ఇన్విటేషన్ ‘బ్యాక్ కవర్’ అద్భుతమైన కెమెరా ఇలస్ట్రేషన్‌ను కలిగి ఉంది. 3డీ మాదిరిగా డిజైన్ చేసి ఉంది. ఇప్పటివరకు ఈ వీడియో 15 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇంటర్నెట్ యూజర్లు ఈ ప్రత్యేకమైన డిజైన్‌ను చూసి ఆశ్చర్యపోయారు.

తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ఈ పెళ్లి కార్డుల ఖరీదు గురించి కూడా కొందరు ఆరా తీశారు. ”ఒక డిజైనర్ వివాహం చేసుకున్నప్పుడు.. ఈ ఐడియా నాకు బాగా నచ్చింది’’ అని ఒక యూజర్ కామెంట్ చేయగా, మరో యూజర్ ‘చాలా ఖరీదైన వెడ్డింగ్ కార్డ్’ అని చమత్కరించారు.

iPhone Wedding Card మూడో యూజర్… మీ ఆలోచన బాగుందని మెచ్చుకోగా.. నాల్గో యూజర్ ”నువ్వు నిజంగా ప్రతిభావంతుడివి” అని కామెంట్ చేశాడు. గతంలో, కంపెనీ రోజువారీ వస్తువుల నుంచి ప్రేరణ పొందిన ఇతర వినూత్న డిజైన్‌లను కూడా రూపొందించింది.

ఐఫోన్-ఫార్మాట్ ఇన్విటేషన్లతో పాటు సంప్రదాయ ఆహ్వాన ఆకృతికి ఆహ్లాదకరమైన అంశాన్ని జోడించి, పాస్‌పోర్ట్‌లు, వార్తాపత్రికలను పోలి ఉండే వెడ్డింగ్ కార్డులను అందిస్తారు. గతేడాది రీసెర్చ్ పేపర్‌లా ఉండే ఓ యూనిక్ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరిగా, వెడ్డింగ్ కార్డు టైటిల్‌లో వివాహ వేదికతో పాటు జంట పేర్లు కూడా ముద్రించారు. వివాహం ప్రాముఖ్యతను కూడా అందులో వివరించారు.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this