Exams: తరుముకొస్తున్న పరీక్షల తరుణం.. ప్రణాళికతో సాగితేనే...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

Exams: తరుముకొస్తున్న పరీక్షల తరుణం.. ప్రణాళికతో సాగితేనే విజయం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

తెలంగాణలో(Telangana) నేటి నుంచి పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఇదే సమయంలో పది, ఇంటర్ పరీక్షల హడావిడి మొదలైంది. మరికొద్ది రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

Exams: తరుముకొస్తున్న పరీక్షల తరుణం.. ప్రణాళికతో సాగితేనే విజయం

తెలంగాణలో(Telangana) నేటి నుంచి పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఇదే సమయంలో పది, ఇంటర్ పరీక్షల హడావిడి మొదలైంది. మరికొద్ది రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రతిక్షణం విలువైనదే. టైం ను వేస్ట్ చేసుకోకుండా ప్లాన్ ప్రకారం చదువుకుంటే సులభంగా లక్ష్యం చేరుకోవచ్చు. క్షణం.. నిమిషం.. గంట.. రోజు.. ఇలా ఒక్క దాన్నీ.. ఆపడం సాధ్యం కాదు. నడుస్తున్న కాలాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవడమే జీవితం. చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్న చందంగా చివరి రోజుల్లో జ్ఞానోదయం పొంది.. అరే.. అలా చేస్తే బాగుండేది.. ఇలా చేయాల్సింది.. ఇప్పుడు ఎక్కడో ఉండేవాళ్లం.. అని చాలా మంది అనుకుంటారు. ఇలాంటి సందర్భం చాలా మందికి ఎదురవుతుంది. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు(Exams) సమీపిస్తున్నాయి. యువతకు ఉద్యోగాలకు ఎంపిక కావాలంటే ఒక్క నిమిషమైనా వృథా చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అందరికీ విద్యార్థి(Students) దశ అత్యంత ముఖ్యమైనది. చదువు, ఆహార అలవాట్లు పక్కా ప్రణాళికగా ఉంటే విజయ తీరాలకు చేరవచ్చు. మే నెలలో పది, ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో విద్యార్థులు అధిక సమయం చదువుకోవడానికి కేటాయించాలి.
లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏకాగ్రత అవసరం. చదువుకునేటప్పుడు సెల్ ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా అడ్డంకులుగా మారతాయి. యువత పగలు, రాత్రి అనే తేడా లేకుండా సెల్ ఫోన్ ను ఉపయోగించడం నేడు సర్వసాధారణమైంది. మరి కొందరు టీవీ చూస్తే గడిపేస్తున్నారు. వీటని కొన్నాళ్లు పక్కన పెట్టి, అభ్యాసంపై దృష్టి సారించడం మంచిది. కబుర్లతో కాలక్షేపం చేయకుండా ముందుకు వెళితే పరీక్షల్లో విజయం సాధించడం ఏమంత కష్టమైన పని కాదు.

exams: తరుముకొస్తున్న పరీక్షల తరుణం.. ప్రణాళికతో సాగితేనే విజయం


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this