Fact Check: దేశంలోని విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్‌టాప్స్‌.....

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Fact Check: దేశంలోని విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్‌టాప్స్‌.. వైరల్ అవుతోన్న ఈ వార్తలో నిజమెంత..?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Fact Check: ఒకప్పుడు ఏదైనా వార్తను ప్రజలకు తెలియజేయాలంటే వార్త పత్రికలు లేదా టీవీలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రభుత్వాలు కూడా తమ పథకాలను ప్రచారం చేసుకోవడానికి కూడా వీటినే ఆశ్రయించేవారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది సోషల్‌ మీడియా…

Fact Check: దేశంలోని విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్‌టాప్స్‌.. వైరల్ అవుతోన్న ఈ వార్తలో నిజమెంత..?

Fact Check: ఒకప్పుడు ఏదైనా వార్తను ప్రజలకు తెలియజేయాలంటే వార్త పత్రికలు లేదా టీవీలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రభుత్వాలు కూడా తమ పథకాలను ప్రచారం చేసుకోవడానికి కూడా వీటినే ఆశ్రయించేవారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది సోషల్‌ మీడియా (Social Media) అందుబాటులోకి వచ్చిన తర్వాత సమూల మార్పులు వచ్చాయి. ప్రభుత్వాలను అందిస్తోన్న సంక్షేమ పథకాలు, తీసుకుంటున్న నిర్ణయాలను సైతం సామాజిక మాధ్యమాల ద్వారానే ప్రమోట్ చేసుకుంటున్నారు. అయితే దీనినే ఆసరాగా తీసుకొని కొందరు నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు ప్రకటించని పథకాలను సైతం ఉన్నట్లు ఫేక్‌ మెసేజ్‌లను రూపొందిస్తూ, లింక్‌లతో గాలం వేస్తున్నారు.

తాజాగా ఇలాంటి ఓ మెసేజ్‌ వైరల్‌ అవుతోంది. ఈ మెసేజ్‌లో వివరాలు ఇలా ఉన్నాయి.. ‘దేశంలోని విద్యార్థులందరికీ ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్‌లను అందిస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌లను పొందడానికి మీ ఫోన్‌ నెంబర్‌ను రిజిస్టర్‌ చేసుకోండి’ అంటూ ఓ లింక్‌ను వైరల్‌ చేస్తున్నారు. అయితే దీనిపై ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (PIB) ఓ అధికారిక ప్రకటన చేసింది. సదరు ఫేక్‌ మెసేజ్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను షేర్‌ చేస్తూ.. ‘వైరల్‌ అవుతోన్న ఈ సమాచారం పూర్తిగా ఫేక్‌. ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని దేనిని అమలు చేయడం లేదు’ అంటూ ట్వీట్ చేశారు. చూశారుగా మీరు కూడా ఇలాంటి మోసపూరిత మెసేజ్‌లకు వీలైనంత వరకు దూరంగా ఉండండి, అనవసరంగా నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోకండి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

[post_ads]

fact check: దేశంలోని విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్‌టాప్స్‌.. వైరల్ అవుతోన్న ఈ వార్తలో నిజమెంత..?

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this