EntertainmentCinemaRam Charan : RC16 షూటింగ్ అప్డేట్.....

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Ram Charan : RC16 షూటింగ్ అప్డేట్.. ఆ పనిలో బిజీగా ఉన్న రామ్ చరణ్..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Ram Charan RC16 Movie Update : రామ్ చరణ్ ఇటీవలే గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తిచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మూడేళ్లు దాటింది ఈ సినిమా ప్రకటించి. ఈ సంవత్సరం లోపు ఎలాగైనా శంకర్ గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ చేస్తారని అభిమానులు భావిస్తున్నారు. అయితే గేమ్ ఛేంజర్ రిలీజ్ కి ముందే తన నెక్స్ట్ సినిమా మొదలుపెట్టబోతున్నాడు చరణ్.

గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో RC16 సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమా మ్యూజిక్ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందని సంగీత దర్శకుడు AR రహమాన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమా రూరల్ బ్యాక్ డ్రాప్ లో మల్లయుద్ధం కథతో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారం నుంచి మొదలవుతుందని సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయిందని తెలుస్తుంది.

అలాగే రామ్ చరణ్ RC16 సినిమా కోసం గడ్డం, మీసం పెంచుతున్నాడని టాక్. చరణ్ పెంచే గడ్డం, మీసం కరెక్ట్ గా అనుకున్న లుక్ వస్తే బుచ్చిబాబు సెప్టెంబర్ నుంచే షూటింగ్ మొదలుపెడతాడని సమాచారం. ప్రస్తుతం చరణ్ భార్యతో కలిసి వెకేషన్ కి వెళ్ళాడు. వెకేషన్ నుంచి రాగానే చరణ్ RC16 పని మీదే ఉంటారని, గేమ్ ఛేంజర్ లాగా ఈ సినిమా లేట్ చేయడని, వచ్చే సంవత్సరమే RC16 రిలీజ్ కూడా చేస్తారని తెలుస్తుంది. దీంతో చరణ్ అభిమానులు గేమ్ ఛేంజర్ కంటే కూడా RC16 మీద ఎక్కువ అంచనాలు పెట్టుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this