CrimeHyderabad: లైక్స్, రీల్స్ కోసం డేంజర్‌ స్టంట్స్‌.....

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Talliki Vandanam (తల్లికి వందనం) Attendance Check – ఇప్పుడు మొబైల్ లోనే మీ పిల్లల హాజరు శాతం తెలుసుకోండి!

ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల Talliki Vandanam Attendance Percentage ఎంత...

How to Know Thalliki Vandanam Eligibility Status | తల్లికి వందనం ఏలిజిబిలిటీ స్టేటస్

తల్లికి వందనం పథకం 2026-27 – అర్హత స్థితి తనిఖీ విధానం2026-27...

Hyderabad: లైక్స్, రీల్స్ కోసం డేంజర్‌ స్టంట్స్‌.. కళ్ళ ముందే ప్రాణాలు విడిచిన స్నేహితుడు!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Table of contents [hide]

సోషల్ మీడియాలో హైలెట్ అవ్వడానికి, లైక్స్ రావడానికి రీల్స్ చేస్తున్న యువత తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా బైక్‌పై డేంజర్‌ స్టంట్స్‌కి నిండు ప్రాణం బలైపోయింది. తనతోపాటు స్నేహితుడిని బైక్‌పై ఎక్కించుకుని ఓ యువకుడు స్టంట్స్‌ చేస్తుంటే అది అదుపు తప్పి స్కిడ్ అయ్యింది. బైక్‌పై వెనక కూర్చున్న యువకుడు ప్రాణాలు కోల్పోగా, బైక్ డ్రైవ్ చేస్తున్న కుర్రాడు కొన ఊరిపితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్‌ మహానగరం శివారు హయత్‌నగర్‌ దగ్గర జరిగింది.

అసలే వర్షాలు.. రోడ్డంతా జారుతూ ఉంది. ఇలాంటి టైమ్‌లో డేంజర్ ఫీట్స్‌ చేస్తూ సోషల్ మీడియా రీల్స్‌ కోసం ఇద్దరు కుర్రాళ్లు చేసిన ప్రయత్నం ఇలా విషాదానికి కారణమైంది. కొడుకును కోల్పోయిన ఆ తల్లి ఇప్పుడు గుండెలు పగిలేలా రోదిస్తోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న కొడుకు బైక్‌ స్టంట్స్‌కు బలైపోయాడని తెలిసి తట్టుకోలేకపోతోంది.
శనివారం (జూలై 20) సాయంత్రం హైదరాబాద్ – విజయవాడ హైవేపై అంబర్‌పేట వద్ద వర్షంలో ఈ బైక్‌పై ఉన్న ఇద్దరూ స్టంట్స్‌ చేస్తుంటే.. మరో బైక్‌పై ఫ్రెండ్స్‌ ఈ దృశ్యాల్ని షూట్ చేస్తున్నారు.

అయితే, క్షణాల్లోనే బైక్ అదుపుతప్పింది ఇద్దరూ కిందపడి తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో తోటి స్నేహితులు హుటాహుటీన సమీప ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ శివ అనే యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. బైక్ నడుపుతున్న యువకుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. చేతికందిన కొడుకు ప్రాణాలు విడవడంతో ఆ తల్లిదండ్రులు దు:ఖాన్ని ఆపడం ఎవరి వల్ల కాలేదు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వీడియో..

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this