EntertainmentPrema Vimanam ప్రేమ ,ఆశలు,ఆశయాలు OTT లో...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Prema Vimanam ప్రేమ ,ఆశలు,ఆశయాలు OTT లో బెస్ట్ ఫ్యామిలీ డ్రామా.. చివరిలో అదిరిపోయే ట్విస్ట్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Prema Vimanam ప్రేమ ,ఆశలు,ఆశయాలు OTT లో బెస్ట్ ఫ్యామిలీ డ్రామా.. చివరిలో అదిరిపోయే ట్విస్ట్​ఓటీటీ లకు డిమాండ్ పెరుగుతున్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇక ఇప్పుడు తెలుగు కంటెంట్ కు ఆదరణ బాగా లభిస్తుంది. దీనితో గత కొన్ని వారాలుగా ఓటీటీ లో కనీసం వారానికి రెండు వారాలకు ఓ తెలుగు వెబ్ సిరీస్ రిలీజ్ అవుతూనే ఉంది. ఇక ఇప్పటికే ఉన్న సినిమాలతో పాటు.. ఇంకా స్ట్రీమింగ్ కు రెడీ గా ఉన్న మూవీస్ కూడా చాలానే ఉన్నాయి. ఇక ఈ మధ్య ఆల్రెడీ ఓటీటీ లో ఉన్న సినిమాలలో ఏ సినిమాలు బావుంటాయి అనే సజ్జెషన్స్ కూడా వచ్చేస్తున్నాయి. అయితే మలయాళ , తమిళ చిత్రాలలోనే కాకుండా తెలుగులో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రేమ కథా చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ మూవీ గురించే. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా ఏంటో తెలుసుకునే ముందు.. ఈ సినిమా కథ ఏంటో చూసేద్దాం. ఈ మూవీ అంతా కూడా 90లలో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ముగ్గురి జీవితాలను పార్లల్ గా చూపిస్తూ ఉంటారు. శాంతమ్మ అనే ఆవిడ తన అత్త , పిల్లలతో కలిసి జీవిస్తూ ఉంటుంది. తోచిన పని చేసుకుంటూ.. ఉన్న దాన్లోనే పిల్లలలను చూసుకుంటూ ఉంటుంది. అయితే ఆమె పిల్లలకు మాత్రం చిన్నపటినుంచి కూడా విమానం ఎక్కాలని కోరిక ఉంటుంది. దానికోసం తన తల్లిని ఎంత అడిగినా కానీ అది మన వలన కాదని చెప్తూ కాలం వెళ్లబుచ్చుతుంది. మరో వైపు.. అదే ఊరిలో మల్లయ్య అనే వ్యక్తి కిరాణా షాప్ నడుపుతూ ఉంటాడు. అతను తన కొడుకు మణిని దుబాయ్ పంపించాలని కలలు కంటూ ఉంటాడు. మణి మాత్రం ఆ ఊరు విడిచి వెళ్ళడానికి ఇష్టపడడు. కారణం ఏంటంటే అతని ఆ ఊరి సర్పంచ్ కూతురు అభిత ను ప్రేమిస్తాడు.

చిన్నప్పటినుంచి మణి, అభిత ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కానీ అభిత తండ్రి మాత్రం ఆమెకు మరొక సంబంధాన్ని ఫిక్స్ చేస్తాడు. దీనితో వీరిద్దరూ ఆ ఊరి నుంచి బయటపడి దుబాయ్ కు పారిపోవాలని డిసైడ్ అవుతారు. మరో వైపు శాంతమ్మ కొడుకులు రామ్ లక్ష్మణ్ విమానం ఎక్కాలనే కోరికతో.. తన తల్లి కష్టపడి సంపాదించిన డబ్బును దొంగలించి హైదరాబాద్ పారిపోతారు. ఇక్కడ మణి, అభితలకు దుబాయ్ కు వెళ్లేందుకు డబ్బులు తక్కువవుతాయి. ఆ డబ్బులను మణి ఎలా సంపాదించాడు ? వారిద్దరూ దుబాయ్ వెళ్ళారా లేదా ? చివరికి కథ ఏమైంది ? రామ్ , లక్ష్మణ్ విమానం ఎక్కారా ? ఊరిలో ఈ విషయాలు తెలిశాయా ? ఆ తర్వాత ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే “ప్రేమ విమానం” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this