EntertainmentCinemaHeroine Downfall తెలుగులో కోటి రెమ్యునరేషన్ తీసుకున్న...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Heroine Downfall తెలుగులో కోటి రెమ్యునరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరోయిన్.. కానీ, ఇప్పుడు చేతిలో సినిమాలు లేక

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Heroine Downfall ఇండస్ట్రీలో తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్స్ గా మారిపోయిన హీరోయిన్స్ చాలామంది ఉంటారు. అయితే వారు తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టేడమే కాకుండా.. ఆ తర్వాత ఇండస్ట్రీలో క్షణం కూడా తీరికి లేకుండా బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటారు. ఈ క్రమంలోనే.. భాషతో సంబంధం లేకుండా..దాదాపు ఆగ్ర హీరోల అందరీ సరసన వరుస సినిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంటారు.

ఇలా దశాబ్దా కాలంలో ఇండస్ట్రీలో ఆగ్ర హీరోయిన్ గా వెలిగిన హీరోయిన్స్ ఇప్పటికే చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ఓ హీరోయిన్ కూడా ఒకరు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ఈమెకు దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఓ స్టార్ హీరోయిన్. ముఖ్యంగా తెలుగులో కోటి రెమ్యునరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఈమె కావడం గమన్హారం. కానీ, అనుకోకుండా  సినిమాలకు దూరం అయిపోయింది.ఇంతకి ఈమె ఎవరో కనిపెట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న Heroine Downfall ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా.. ఆమె మరెవరో కాదు.. గోవా బ్యూటీ ‘ఇలియానా’. ఈమె మొదటిగా రామ్ పోతినేని నటించిన ‘దేవదాసు’ సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఇక మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. ఈ క్రమంలోనే.. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘పోకిరి’ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఇక ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ బ్యూటీ క్రేజ్ ఇండస్ట్రీలో అమాంతం పేరిగిపోయింది. ఆ తర్వాత ఇలియానా ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది. దాదాపు స్టార్ హీరోస్ అందరీ సరసన ఆఫర్స్ అందుకుంటూ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అంతేకాకుండా.. తెలుగు ఇండస్ట్రీలో రూ.కోటి రెమ్యునరేషన్ తీసుకున్న తొలి హీరోయిన్ గా ఇలియానా కావడం గమన్హారం.

కానీ, రాను రాను టాలీవుడ్ లో ఇలియానకు ఆఫర్స్ తగ్గిపోయాయి. దీంతో ఈ గోవా బ్యూటీ నెమ్మదిగా బాలీవుడ్ కు మకాం మార్చింది. అక్కడ కూడా వరుసగా ఆఫర్స్ అందుకుంటూ.. సినిమాలు చేసింది. కానీ, అవన్నీ డిజాస్టర్స్ గా నిలవడంతో.. సినిమాలకు పూర్తిగా దూరమైంది.. దీంతో పూర్తిగా సినిమాలకు ఇటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా ఇలాయానా.. సడన్ గా తాను ప్రెగ్నెంట్ అంటూ అనౌన్స్ చేసి షాక్ ఇచ్చింది. విచిత్రం ఏమిటంటే.. ఈ బ్యూటీ పెళ్లి విషయాన్ని దాచిపెట్టి నేరుగా ప్రెగ్నెన్సీ గురించి అభిమానులతో పంచుకుంది. ఇక ఆ తర్వాత.. తన భర్త, బాబు ఫోటోస్ షేర్ చేస్తూ వైవాహిక బంధం గురించి తన అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఇలియానా తన బాబు, భర్తతో కలిసి విదేశాల్లో ఉంటుంది. అలాగో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన బాబు ఫోటోస్ షేర్ చేస్తుంది. ఇకపోతే అప్పటిలో ఎంతో క్రేజ్ ఉన్నా హీరోయిన్ ఇలా ఇండస్ట్రీకి దూరం కావడంతో ఆమె ఫ్యాన్స్ కాస్త బాధపడుతున్నారు. కాగా, ప్రస్తుతం ఇలియానా లేటెస్ట్ ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలియానా లేటెస్ట్ ఫిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Source: iDreampost


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this