EntertainmentCinemaFilm debut: టాలీవుడ్‌లోకి మరో వారసుడు ఎంట్రీ!

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Film debut: టాలీవుడ్‌లోకి మరో వారసుడు ఎంట్రీ!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Jayakrishna: టాలీవుడ్‌లోకి మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడట… ఈ మధ్యకాలంలో ఎంతో మంది స్టార్లు తమ పిల్లలను చిత్రసీమకు పరిచయం చేశారు. కాకపోతే తాజాగా వెండితెరపై మెరవాలనుకుంటున్న వారసుడి ఎంట్రీతో ఆ కుటుంబం నుంచి మూడో తరం ఆరంగేట్రం చేసినట్లు అవుతుంది.

ఇప్పటికే ఆ కుటుంబానికి చెందిన కొందరు వారసులు వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా, ఇప్పుడు వస్తున్న యంగ్‌ హీరో… తన బాబాయ్‌లా మిల్క్‌ బాయ్‌ లుక్కులో కనిపిస్తుండటమే టాలీవుడ్‌లో స్పెషల్‌ టాపిక్‌గా మారింది. సూపర్‌స్టార్‌ కృష్ణ కుటుంబం నుంచి మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జరుగుతున్న సమాచారం హాట్‌టాపిక్‌గా మారుతోంది.

ఎందరో వారసులు ఎంట్రీ..
వాస్తవానికి కృష్ణ కుటుంబం నుంచి ఇప్పటికే ఎందరో వారసులు ఎంట్రీ ఇచ్చారు. ఆయన కుమారుడు మహేశ్‌బాబు టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడిగా కొనసాగతున్నారు. ఇక త్వరలో మహేశ్‌బాబు కుమారుడు గౌతమ్‌ కృష్ణ సినీ ప్రవేశం ఉంటుందని ఊహాగానాలు కొనసాగుతుండగా, అంతకు ముందే మహేశ్‌బాబు అన్న కుమారుడు జయకృష్ణ ఎంట్రీ ఉంటుందని తాజా సమాచారం.

మహేశ్ అన్న దివంగత నటుడు రమేశ్‌బాబు కొడుకు జయకృష్ణ చూడటానికి అచ్చం మహేశ్ బాబులానే ఉంటాడు. రమేశ్‌బాబు, కృష్ణ బ్రతికి ఉంటే ఇప్పటికే జయ క్రిష్ణను హీరోగా పరిచయం చేసేవారని అంటున్నారు. ఐతే ఇప్పుడు ఆ బాధ్యత మహేశ్‌ తీసుకున్నాడని టాక్. జయకృష్ణ కోసం కొన్ని కథలు కూడా వినటం జరిగిందని, మొత్తం సెట్ అయితే వచ్చే పుట్టినరోజు లోగా జయకృష్ణ సినిమా రిలీజ్ చేస్తారంటున్నారు.

ఇప్పటికే జయకృష్ణకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. కృష్ణ ఫ్యాన్స్, మహేశ్‌ ఫ్యాన్స్‌తో పాటు వేరే స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా జయక్రిష్ణకు అభిమానులుగా మారటం విశేషం. అంతేకాదు జయకృష్ణ లుక్కు చూసిన కొందరు అభిమానులు జూనియర్‌ కృష్ణగా పిలుస్తున్నారట… మరోవైపు జయకృష్ణ కోసం కథలు వింటున్న మహేశ్‌బాబు… ఎలాంటి స్టోరీ ఓకే చేస్తాడని ఫ్యామిలీ అంతా ఎదురు చూస్తున్నారు.

Source: 10TV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this