SpiritualGuru Purnima 2024: గురు పౌర్ణమి ఎప్పుడు...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Guru Purnima 2024: గురు పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి? గురు అనుగ్రహం కోసం చేయాల్సిన పరిహారాలు ఏమిటి ? పూర్తి వివరాలు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

గురు పౌర్ణమి పండుగను ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఆషాఢ పౌర్ణమి తిధి రెండు రోజులు అంటే మిగులు తగులుగా వచ్చింది. ఈ పౌర్ణమి తిథి జూలై 20న ప్రారంభమై జూలై 21న ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో గురు పూర్ణిమని ఎప్పుడు జరుపుకోవాలి ఖచ్చితమైన తేదీ విషయంలో గందర గోళం నెలకొంది. పూర్ణిమను జూలై 20 లేదా 21వ తేదీన జరుపుకోవాలా.. అదే విధంగా ఆషాఢ పూర్ణిమ స్నాన దానం, ఉపవాసం ఏ రోజున ఆచరించాలి? గురు పూర్ణిమ ఖచ్చితమైన తేదీ, శుభ సమయం గురించి పండితులు చెప్పిన విషయాలను ఈ రోజు తెలుసుకుందాం..

గురు పూర్ణిమ తేదీ 2024

హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తిది జూలై 20న సాయంత్రం 5:59 గంటలకు ప్రారంభమై మర్నాడు అంటే జూలై 21న మధ్యాహ్నం 03:46 గంటలకు ముగుస్తుంది.

అయితే హిందూ సంప్రదాయంలో సూర్యోదయం సముయంలో ఉన్న తిధి ని పరిగణలోకి తీసుకుంటారు కనుక జూలై 21వ తేదీ ఉదయం 05:37 గంటలకు ఆషాఢ పౌర్ణమి తిథి నాడు సూర్యోదయం అవుతుంది. అటువంటి పరిస్థితిలో జూలై 21 ఆదివారం రోజున గురు పౌర్ణమిగా జరుపుకుంటారు.

గురు పూర్ణిమ రోజున చేసే స్నానం, దానం

ఆషాఢ పౌర్ణమి రోజున స్నానం, దానం చేయాలనుకుంటే జూలై 21న ఉదయం 04:14 నుండి 04:54 వరకు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయవచ్చు. ఈ సమయంలో స్నానం చేయలేకపోతే.. సూర్యోదయం తర్వాత కూడా స్నానం చేయవచ్చు. ఆ తర్వాత సామర్థ్యం మేరకు చంద్రునికి సంబంధించిన వస్తువులను దానం చేయండి. అయితే ఆషాఢ పూర్ణిమ ఉపవాసం ఒక రోజు ముందుగా అంటే జూలై 20న ఆచరించబడుతుంది.

గురు పూర్ణిమ 2024 శుభ సమయం

గురు పూర్ణిమ రోజు శుభ సమయం లేదా అభిజీత్ ముహూర్తం మధ్యాహ్నం 12:00 నుండి 12:55 వరకు.

విజయ ముహూర్తం మధ్యాహ్నం 02:44 నుండి 03:39 వరకు.

అమృత సమయం సాయంత్రం 06:15 నుండి 07:45 PM వరకు ఉంటుంది.

గురు పూర్ణిమ నాడు చేయాల్సిన పరిహారాలు

గురు పూర్ణిమ రోజున ఉదయం స్నానం చేసి పూజ చేసిన తర్వాత గురువు వద్దకు వెళ్లి ఇంటికి ఆహ్వానించండి. వారిని గౌరవించండి. పాదాలను తాకి ఆశీర్వాదం పొందండి. అప్పుడు వారికి ఆహారం అందించి.. తగిన బహుమతులు ఇవ్వండి. గురువుని తృప్తిపరచి పంపండి. గురు పూర్ణిమ రోజున ఇలా చేయడం వల్ల ప్రతి రంగంలో పురోగతిని పొందుతారు. ఎందుకంటే గురువును సేవించడం ద్వారా జాతకంలో గురు దోషం తొలగిపోతుంది. గురువు అనుగ్రహం లేకుండా జ్ఞానం, మోక్షం రెండూ లభించవని విశ్వాసం.

గురు పూర్ణిమ రోజున పేద బ్రాహ్మణుడికి పసుపు వస్త్రాలు, పసుపు, ఇత్తడి పాత్రలు, బెల్లం, నెయ్యి, పసుపు బియ్యం మొదలైన వాటిని దానం చేయండి. ఈ రోజున దేవ గురువైన బృహస్పతిని ఆరాధించడం వలన సంతోషం, సౌభాగ్యం కలుగుతాయి.

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this