InternationalSunita Williams: మట్టి లేకుండా అంతరిక్షంలో మొక్కలు...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Sunita Williams: మట్టి లేకుండా అంతరిక్షంలో మొక్కలు పెంచుతున్న సునీతా విలియమ్స్.. ఎలాగో తెలుసా?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Sunita Williams Plants trees at Universe : నాసా యోమగామి సునీతా విలియమ్స్ బోయింగ్ స్టార్‌ లైనర్ మిషన్ కింద తన భాగస్వామి బుచ్ విల్మోర్‌ తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లారు. ఇకపోతే తాజాగా విలియమ్స్ అంతరిక్షంలో మట్టి లేకుండా మొక్కలను పెంచడంలో విల్మోర్‌ తో కలిసి పని చేస్తున్నట్లు కనపడుతుంది. మైక్రోగ్రావిటీలో మొక్కలకు నీరు పెట్టే మార్గాలను పరీక్షిస్తూ ఆమె సమయాన్ని గడిపింది. విలియమ్స్ ప్లాంట్ వాటర్ మేనేజ్మెంట్ హార్డ్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసి వివిధ ద్రవ ప్రవాహ పద్ధతులను పరీక్షించారు.

విలియమ్స్ హైడ్రోపోనిక్స్, గాలిని ఉపయోగించి అదనపు పరీక్షలు నిర్వహించారు. అంతరిక్ష నౌక, అంతరిక్ష ఆవాసాలలో వివిధ రకాల మొక్కలను ఎలా సమర్థవంతంగా పోషించాలో చూపించారు. వ్యోమగాములు ఇద్దరూ నిర్వహించిన ఈ ప్లాంట్ వాటర్ మేనేజ్మెంట్ అధ్యయనం బరువులేని వాతావరణంలో మొక్కలకు నీరు పెట్టే పద్ధతులను అన్వేషించడం లక్ష్యంగా ఉంది. విలియమ్స్, విల్మోర్ కూడా ఈ మొత్తం పరీక్ష వీడియోను రూపొందించారు.

స్టార్‌ లైనర్ వ్యోమ నౌకలో సాంకేతిక లోపం కారణంగా ఈ ఇద్దరు వ్యోమగాములు ప్రస్తుతం అందులో చిక్కుకుపోయారు. అంతా మిషన్ ప్లాన్ ప్రకారం జరిగిఉంటే.. జూన్ 14న అంతరిక్ష నౌకను వదిలి ఇక్కడికి రావలిసి ఉండేది. అయితే, మొదట్లో హీలియం లీక్ కారణంగా సాంకేతిక లోపంతో వాయిదా పడింది. ఆ తర్వాత దాని థ్రస్టర్‌ లతో సమస్య ఏర్పడింది. దాంతో వారి ప్రయాణం మరోసారి వాయిదా పడింది. దింతో ఇద్దరు వ్యోమగాములు భూమికి ఎప్పుడు తిరిగి వస్తారనేది ఇంకా నిర్ణయించలేదు.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this