InternationalTrump: అచ్చం అలాగే.. ట్రంప్‌పై దాడిని చిత్రీకరించిన...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

Trump: అచ్చం అలాగే.. ట్రంప్‌పై దాడిని చిత్రీకరించిన ఆఫ్రికా చిన్నారులు.. వీడియో వైరల్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Donald Trump Assassination Attempt: ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ట్రంప్‌పై జరిగిన ఈ దాడిలో తృటిలో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. ఈ దాడి తర్వాత ప్రపంచమంతా ఈ విషయంపై చర్చించింది. ఇదిలా ఉండగా.. ఆఫ్రికా దేశమైన ఉగాండాలోని కొంత మంది పిల్లలు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన తీరును తమ నటన ద్వారా వీడియో రూపంలో చిత్రీకరించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోలో, ఉగాండాలోని పిల్లలు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన తీరును పునఃసృష్టించారు. ఈ వీడియోలో ఒక పిల్లవాడు ట్రంప్‌లా నటించగా.. మరికొందరు పిల్లలు ఆయన భద్రతా సిబ్బందిగా, ప్రేక్షకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ నాటకీయ సన్నివేశంలో అచ్చుగుద్దినట్లు ట్రంప్‌పై దాడి జరిగిన విధానాన్ని వీడియో రూపంలో చూపించారు. కాల్పులు జరగగానే సెక్యూరిటీగా వ్యవహరించే పిల్లలు వేగంగా ట్రంప్‌లా నటించే పిల్లవాడిని చుట్టుముట్టి, సురక్షితంగా తీసుకువెళతారు. ఈ వీడియో జులై 13న పెన్సిల్వేనియాలో ర్యాలీ సందర్భంగా ట్రంప్ హత్యాయత్నం నుంచి బయటపడిన నిజ జీవిత సంఘటన ఆధారంగా చిత్రీకరించారు.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.



వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this