Uncategorizedఅక్టోబర్ 8న “జగనన్న విద్యాకానుక” JAGANANNA VIDYAA...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

అక్టోబర్ 8న “జగనన్న విద్యాకానుక” JAGANANNA VIDYAA KANUKA ON OCTOBER 8TH

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ శ్రీ తుమ్మా విజయకుమార్ రెడ్డి

ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “జగనన్న విద్యాకానుక” కార్యక్రమాన్ని అక్టోబర్ 8న (గురువారం) ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ఎక్స్-అఫీషియో సెక్రెటరీ శ్రీ తుమ్మా విజయకుమార్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 

ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 42,34,322 మంది విద్యార్థినీ, విద్యార్ధులకు  దాదాపు రూ.650 కోట్ల ఖర్చుతో స్టూడెంట్ కిట్లు పంపిణి చేస్తారని వెల్లడించారు.

 ప్రభుత్వ యాజమాన్యం లోని అన్ని రకాల పాఠశాలల్లో ఒకటి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యారినీ, విద్యార్థులందరికీ స్టూడెంట్  కిట్లు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. 

ప్రతి స్టూడెంట్ కిట్ లో 3 జతల యూనిఫారాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఒక స్కూల్ బ్యాగ్ ఉంటాయని తెలిపారు. 

బడిబయట పిల్లల సంఖ్యను గణనీయంగా తగ్గించడం, తద్వారా పాఠశాలల్లో పిల్లల నమోదు శాతం పెంచడంతో పాటు అభ్యసనా కార్యక్రమంలో వారు ఉత్సాహంగా పాల్గొనేలా చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించడమే 

ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని ఈ సందర్భంగా సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ఎక్స్-అఫీషియో సెక్రెటరీ శ్రీ విజయకుమార్ రెడ్డి తెలిపారు.

జారీ చేసినవారు: సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్, విజయవాడ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this