Monday, February 2, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
బది‘లీల’కు బ్రేక్‌..!

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

బది‘లీల’కు బ్రేక్‌..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
  • అక్రమాలను తోడుతున్న అధికారులు
  • దరఖాస్తు చేసినవారికి పిలుపులు
  • ఓ సంఘం నాయకుడి  దరఖాస్తు తిరస్కరణ, చార్జస్‌ ఫ్రేమ్‌

అనంతపురం విద్య, నవంబరు 28: కొందరు ఉపాధ్యాయులు, సంఘాల నాయకుల బది‘లీలలు’కు బ్రేక్‌ వేసేందుకు జిల్లా విద్యాశాఖాధికారులు సిద్ధమయ్యారు. బదిలీల్లో ప్రిఫరెన్సియల్‌, స్పౌజ్‌ను వినియోగించుకునేందుకు అడ్డదారు లు తొక్కిన పలువురు సంఘాల నాయకులు, ఉపాధ్యాయులపై శనివారం ‘టీచర్ల బది‘లీలలు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించిన విషయం విదితమే. దీనిని జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్‌ సీరియ్‌సగా తీసుకున్నారు. వెంటనే విచారణ చేయాలంటూ అధికారులను ఆదేశించారు. దీంతో కూడేరు, బుక్కరాయసముద్రం తదితర మండలాల్లో ప్రిఫరెన్సియల్‌, స్పౌజ్‌ పాయింట్ల కోసం అక్రమ మార్గాలు తొక్కిన వారి దరఖాస్తులను బయటకు తీసి, పరిశీలించారు. బుక్కరాయసముద్రంలోని ఓ ఉపాధ్యాయుడికి చెందిన స్పౌజ్‌ సర్టిఫికెట్‌కు సంబంధించిన వారిని ఆదివారం స్వయంగా వచ్చి, వివరాలు తెలపాలంటూ విద్యాశాఖాధికారాలు ఆదేశించారు. ఓ సంఘం ప్రధానకార్యదర్శి స్పౌజ్‌కు సంబంధించిగతంలో సమర్పించిన సర్టిఫికెట్లను క్షుణ్ణంగా మరోసారి పరిశీలించారు. బోగస్‌ సర్టిఫికెట్లు, ఉత్తర్వు కాపీలు చూపి, తప్పుదోవ పట్టించారని నిర్ధారణకు వచ్చిన అధికారులు.. ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమయ్యారు. దీనిపై రాత్రి డీఈఓ శామ్యూల్‌ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. ఆ నాయకుడు తన భార్య (స్పౌజ్‌) అనంతపురంలో పనిచేస్తున్నట్లు దరఖాస్తులో ఇచ్చాడన్నారు. ఆయన దరఖాస్తును తిరస్కరించామన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు చార్జస్‌ ఫ్రేం చేశామన్నారు. జీవోకు విరుద్ధంగా ఉన్న, ఎంఐ కేటగిరీకి చెందిన మరో 49 దరఖాస్తులను తిరస్కరించినట్లు తెలిపారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this