Wednesday, October 1, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Lock Down: అక్కడ మరోసారి లాక్‌డౌన్.. మార్చి...

BMI Calculator (BMI కాలిక్యులేటర్) – మీ BMI Calculate చేసుకుని మీ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోండి

మీ ఆరోగ్యం, మీ ఎత్తు మరియు బరువుకు సరైన సంబంధం ఉందని...

DSC 2025 Web Options: School Head Master Contact Number with DISE Code | DSC School Selection Guide

Head Master Contact : DSC 2025లో ఎంపికైన అభ్యర్థులందరికీ అభినందనలు!...

DSC 2025 New Teachers: MEO Staff Contact Numbers Finder Tool

DSC 2025 లో నియమితులైన అందరు ఉపాధ్యాయులకు హార్థిక అభినందనలు! MEO...

Lock Down: అక్కడ మరోసారి లాక్‌డౌన్.. మార్చి 31 వరకు స్కూల్స్‌ మూసివేత.! నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Lockdown In Pune: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ తీవ్ర రూపం దాల్చుతోంది. దేశంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. కొన్ని రాష్ట్రాలో మళ్లీ తీవ్ర స్థాయిలో కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్రలో ముందంజలో ఉంది. రోజురోజుకు కొత్త కేసులు నమోదవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి లాక్‌డౌన్ ప్రకటించగా.. మరికొన్ని జిల్లాల్లో పాక్షిక లాక్‌డౌన్, ఇంకొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఈ క్రమంలోనే మార్చి 31 వరకు పూణేలోని పాఠశాలలు, కాలేజీలను మూసివేస్తున్నట్లు పూణే డివిజినల్ కమిషనర్ సౌరభ్ రావు ప్రకటించారు.
అలాగే పూణేలో రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని.. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవ్వరూ కూడా బయటికి రాకూడదని తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లలను 50 శాతం మేర సీటింగ్ సామర్ధ్యంతో నడిపించాలని.. రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచాలని ఆదేశించారు. పెళ్లిళ్లు, అంత్యక్రియలు, రాజకీయ కార్యక్రమాలకు 50 మందికే అనుమతి ఉందని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా లాక్‌డౌన్ రూల్స్‌ అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కాగా, పూణేలో పెరుగుతోన్న కరోనా కేసులపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మాట్లాడుతూ.. ప్రజలు కరోనా నిబంధనలను పాటించకపోవడం వల్లే వైరస్ వ్యాప్తి ఎక్కువైందని.. అందుకోసమే ఈసారి కఠినంగా లాక్‌డౌన్ విధిస్తామని తెలిపారు. అంతేకాకుండా వ్యాక్సిన్ డోసులను అదనంగా కేటాయించాలని కేంద్రాన్ని కోరుతామని తెలిపారు.
అటు ముంబై నగరంలో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పెద్ద భవనాల్లో ఉంటున్నవారిలో 90 శాతం మందికి కరోనా వైరస్ సోకిందని.. అలాగే మార్చి నెల మొదటి నుంచి మురికివాడల్లో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) తెలిపింది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this