Tenali Corona Cases: గుంటూరు జిల్లాలో కరోనా...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Tenali Corona Cases: గుంటూరు జిల్లాలో కరోనా కల్లోలం.. తెనాలిలో ఒక్క రోజే ప్రమాదకరంగా నమోదైన కేసులు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కరోనా మరోసారి కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా ప్రమాద ఘంటికలు
మోగిస్తుంది. ఏపీలో కూడా క్రమక్రమంగా కరోనా వ్యాప్తి పెరుగుతుంది.  గుంటూరు
జిల్లా తెనాలిలో కోవిడ్-19 కేసుల పెరుగుదల టెన్షన్ పెడుతుంది. మంగళవారం
ఒక్క రోజే పట్టణంలో 24 కేసులు వెలుగుచూశాయి. నర్సింగ్‌ కాలేజీకి చెందిన 11
మంది విద్యార్థినులకు కొవిడ్‌ సోకినట్లు తేలింది. మున్సిపాలిటీలో పని చేసే
ఎంప్లాయిస్, అధికారులకు కూడా కరోనా సోకినట్లు సమాచారం. కేసుల పెరుగుదలతో
అధికార యంత్రాంగం అలర్టైంది. నర్సింగ్‌ కాలేజీలో ఎక్కువ మంది కరోనా బారిన
పడటంతో కళాశాలలోని స్టూడెంట్స్ అందరికీ కొవిడ్‌ టెస్టులు చేయించాలని
నిర్ణయించారు. ఈ మేరకు త్వరితగతిన ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు
జిల్లాలో కూడా మూడు రోజులుగా కోవిడ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. తొలుత
తాడేపల్లి మండలంలో వైరస్ కేసులు పెరిగాయి. తాజాగా తెనాలిలో కొవిడ్‌
సోకుతున్న వారి సంఖ్య పెరుగుతుండంతో ప్రజల్లో టెన్షన్ నెలకుంది.

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్ని రోజుల్లో మహారాష్ట్ర,
మధ్యప్రదేశ్, హరియాణా, పంజాబ్‌ తదితర 19 రాష్ట్రాల్లో కరోనా కేసులు
పెరుగుతున్నాయి. అంతకుముందు కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే ఈ ధోరణి
కనబడింది. మరణాల సంఖ్య కూడా ఆ మేరకు పెరుగుతోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్,
ఒడిశా‌ తదితరచోట్ల కొన్ని ప్రాంతాల్లో మళ్లీ రాత్రి పూట కర్ఫ్యూ విధించటం
మొదలుపెట్టారు.

ఈ నేప‌థ్యంలో ఒడిశా ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. పరీక్షలు లేకుండానే
1 నుండి 8 తరగతుల విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేస్తూ ఒడిశా
స్కూల్‌ అండ్‌ మాస్‌ ఎడ్యూకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ బుధవారం ప్రకటించింది.
2020-21 విద్యా సంవత్సరానికిగాను ఈ నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌-19 మహమ్మారి
నేపథ్యంలో పాఠశాలలు బంద్‌ చేస్తున్న కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం
తీసుకుంది. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు పాఠశాలలకు ఇది
వర్తించనుంది.

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this