Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు ముఖ్య గమనిక.....

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు ముఖ్య గమనిక.. ఇలా చేస్తే తక్కువ ధరకే సిలిండర్ పొందొచ్చు.!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

LPG Subsidy Alert: పెట్రోల్-డీజిల్ ద్రవ్యోల్బణం
సాధారణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. కానీ దాని కంటే ఎక్కువగా, పెరిగిన
గ్యాస్ సిలిండర్ ధరల వల్ల సామాన్యుల జేబులు చిల్లుపడుతున్నాయి. గత కొన్ని
నెలల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఏకంగా రూ. 200 పెరగడంతో సామాన్య ప్రజలు
లబోదిబోమంటున్నారు.

టెన్షన్ పడకండి. మీకోసం ఓ గుడ్ న్యూస్.. సబ్సిడీ ద్వారా వంట గ్యాస్
సిలిండర్ రూ. 300 కంటే తక్కువకు లభిస్తుంది. ఈ ఎల్పీజీ సబ్సిడీ కేవలం
తక్కువ ఆదాయం ఉన్నవారికి మాత్రమే. మీ వార్షిక ఆదాయం రూ. 10 లక్షలు అయితే ఈ
సబ్సిడీకి మీరు అనర్హులు.

వాస్తవానికి, కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీ
ఇస్తోంది. కానీ గత కొన్ని నెలలుగా, ప్రజల ఖాతాల్లోకి నామమాత్రపు సబ్సిడీ
మాత్రమే వస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది అయితే ఎల్‌పీజీపై సబ్సిడీని
ప్రభుత్వం తొలగించిందని కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

అయితే పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ”ఎల్పీజీపై
సబ్సిడీ ఆపలేదని.. సామాన్యులకు ఇది వర్తిస్తుందని” కీలక ప్రకటన చేశారు. అదే
సమయంలో, ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని
రూ.174.80 నుంచి రూ. 312.80 రూపాయలకు పెంచింది. అయితే ఈ సబ్సిడీ కేవలం ఆ
స్కీం కింద రిజిస్టర్ అయినవారికి మాత్రమే.

ఆధార్ అనుసంధానం తప్పనిసరి…

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ పొందాలంటే,
మీ ఆధార్ కార్డు.. ఈ పధకంతో అనుసంధానం అయి ఉండాలి. అలా కాకపోతే సబ్సిడీ
మొత్తం మీ ఖాతాలోకి పడదు. మొదటిగా ఆధార్‌ను బ్యాంక్ అకౌంట్‌తో లింకప్
చేసుకోవాలి. అలాగే మీ మొబైల్ నెంబర్ గ్యాస్ ఏజెన్సీలో నమోదు కావాలి. ఆధార్
లింక్ చేయకపోతే లేదా మొబైల్ నంబర్ రిజిస్టర్ చేయకపోతే, ఎల్పీజీ సబ్సిడీ
సొమ్ము ఖాతాల్లోకి రాదు.

ఎలా నమోదు చేయాలి…

మీ ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవడానికి మూడు మార్గాలు ఉన్నాయి.
మొదటిది మొబైల్ నంబర్ ద్వారా, రెండవది SMS ద్వారా, మూడవది UIDAI
వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా. మీ ఆధార్ నెంబర్ అనుసంధానం అయిన తర్వాత
రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ వస్తుంది.

ఈ నంబర్‌కు కాల్ చేయండి…

మీరు మొబైల్ నంబర్ నుండి ఎస్ఎంఎస్ ద్వారా రిజిస్టర్ చేసుకోలేకపోతే, మీరు
Indane Gas ఏజెన్సీ టోల్ ఫ్రీ నెంబర్ 1800 2333 5555కు కాల్ చేసి, మీ
ఆధార్ నెంబర్‌ను లింక్ చేయమని కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌కు చెప్పవచ్చు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this