PM Kisan: రైతులకు అలర్ట్.. ఆ తేదీలోపు...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

PM Kisan: రైతులకు అలర్ట్.. ఆ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారి అకౌంట్లోకి రూ.4000.. ఎలా అంటే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

PM Kisan Yojana: రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీం 
తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. రైతులకు సహాయం చేయడానికి ప్రభుత్వం వారి
ఖాతాకు ఏటా ఆరు వేల రూపాయల సహాయం ఇస్తుంది. ఈ మొత్తాన్ని రైతులు మూడు
విడతలుగా పొందుతారు. అంటే వారికి రెండు వేల రూపాయలు లభిస్తాయి. మొదటి విడత
ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు, రెండవ విడత ఆగస్టు 1 నుండి నవంబర్ 30 వరకు
మరియు మూడవ విడత డిసెంబర్ 1 నుండి మార్చి 31 వరకు వస్తుంది. ఇప్పటి వరకు
కేంద్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లలోకి 7 విడతల డబ్బులను అందించింది. ఇక 8వ
విడతల డబ్బులను అందించేందుకు కేంద్రం సన్నద్ధమవుతుంది. ఇక డబ్బులను ఏప్రిల్
నుంచి జూలై మధ్యలో రైతుల అకౌంట్లలో వేయనుంది.

ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, మార్చి 31 లోపు ఈ పథకం కింద
నమోదు చేసుకోవాలి. మీరు ఇలా చేస్తే, ఎనిమిదవ విడతతో మీ ఖాతాకు రెండు వేల
రూపాయలు వస్తాయి. మార్చి 31 లోగా నమోదు చేసుకుంటే, మీ ఖాతాకు నాలుగు వేల
రూపాయలు వస్తాయి. అది ఎలాగంటే.. ఒక రైతు నమోదు చేసుకున్నప్పుడల్లా,
ప్రభుత్వం అతనికి ఒకేసారి రెండు వాయిదాలను అందిస్తుంది. కాబట్టి మీరు
దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. (PM Kisan Samman Nidhi)

అయితే ఈ డబ్బులు వచ్చే ముందు మీ పేరు బెనిఫీసియరీ లిస్టులో ఉందో లేదో
ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక వేళ ఆ లిస్టులో పేరు లేకపోతే డబ్బులు రావు.
కేవలం అందులో ఉన్నవారికి మాత్రమే డబ్బులు జమ చేయబడతాయి. ఇందుకోసం పీఎం
కిసాన్ వెబ్ సైట్‏ను సందర్శించాల్సి ఉంటుంది. మీకు ఫార్మర్స్ కార్నర్ అనే
ఆప్షన్ కనిపిస్తుంది. దానిని సెలక్ట్ చేసుకొని బెనిఫీషియరీ లిస్ట్ ఆప్షన్
ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత మీ స్టేట్, జిల్లా, ఊరు పేరు ఎంటర్ చేసి మీ
పేరు ఆ లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పీఎం కిసాన్
స్కీంలో చేరకపోతే.. ఇప్పుడు కూడా ఆన్ లైన్ లోనే ఈ పథకంలో చేరొచ్చు.
అందుకోసం మీ బ్యాంక్ అకౌంట్, పొలం పాస్ బుక్, ఆధార్ కార్డు ఉంటే
సరిపోతుంది. మరీ ఆలస్యం చేయకుండా మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. అలాగే
ఇప్పటివరకు ఈ స్కీంలో చేరి ఉండకపోతే వెంటనే చేరండి


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this