Telangana: తెలంగాణలో పాక్షిక లాక్‌డౌన్..? త్వరలో సీఎం...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Telangana: తెలంగాణలో పాక్షిక లాక్‌డౌన్..? త్వరలో సీఎం కేసీఆర్ కీలక సమీక్ష

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు,
కాలేజీలు మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే పెద్ద
ఎత్తున కేసులు వస్తుండడంతో.. విద్యా సంస్థల మూసివేతపై త్వరలోనే నిర్ణయం
తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్‌తో
ఇప్పటికే పలు రాష్ట్రాలు పాక్షిక లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలను అమలు
చేస్తున్నాయి. తెలంగాణలోనూ కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ
వస్తోంది. ముఖ్యంగా స్కూళ్లలో ఎక్కువ కేసులు నమోదవున్నాయి. ఈ నేపథ్యంలో
రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. పాక్షిక లాక్‌డౌన్ అమలు చేయాలని
భావిస్తున్నట్లు తెలుస్తోంది. శని, ఆది వారాల్లో హైదరాబాద్‌లో లాక్‌డౌన్
విధించాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వారంలో 2 రోజులు లాక్‌డౌన్
లేదా రాత్రి పూట కర్ఫ్యూ విధించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం
యోచిస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కేసులు వస్తుండడంతో.. విద్యా సంస్థల
మూసివేతపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సినిమా
థియేటర్లు, పార్క్‌లు, జనాల రద్దీ ఉండే ఇతర ప్రాంతాల్లో ఆంక్షలు విధించాలని
భావిస్తోంది. కరోనా విజృంభణ నేపథ్యంలో మార్చి 26 కంటే ముందే అసెంబ్లీ
సమావేశాలను ముగించే యోచనలో ఉన్నారు. కరోనాపై త్వరలోనే సీఎం కేసీఆర్ ఉన్నత
స్థాయి సమీక్ష నిర్వహిస్తారని.. ఆ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని
తెలుస్తోంది. 

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 394 మందికి కరోనా సోకింది. శనివారం
64,898 టెస్టులు చెయ్యగా 394 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య
3,03,118కి చేరింది. కొత్తగా కరోనాతో ముగ్గురు మరణించారు. మొత్తం మరణాల
సంఖ్య 1,669కి చేరంది. మరణాల రేటు 0.55 శాతం ఉంది. తాజాగా 194 మంది
కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 2,98,645కి చేరింది. రికవరీ రేటు
98.52 శాతానికి చేరింది. ప్రస్తుతం 2,804 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వాటిలో
1123 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. GHMC పరిధిలో 81 కేసులు
వచ్చాయి.

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this