LIC Policy: రోజూ రూ.121 దాచుకుంటే రూ.27...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

LIC Policy: రోజూ రూ.121 దాచుకుంటే రూ.27 లక్షలు రిటర్న్స్… ఈ పాలసీ మీకు తెలుసా?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

LIC Policy | మీ పిల్లల
భవిష్యత్తు కోసం మంచి ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? ఎల్ఐసీలో అనేక
పాలసీలు ఉన్నాయి. అయితే ఎల్ఐసీలో లేని పాలసీలు కూడా ప్రచారంలో ఉన్నాయి.
అసలు పాలసీల గురించి తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి.

1. ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ… ఈ పాలసీ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా?
ఎక్కడైనా యాడ్ చూశారా? అసలు ఎల్ఐసీలో కన్యాదాన్ పేరుతో పాలసీ లేనే లేదు.
కానీ మార్కెట్‌లో మాత్రం ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ చాలా పాపులర్.

 2. కేవలం నెలకు రూ.121 చొప్పున పొదుపు చేస్తే అమ్మాయి పెళ్లి లేదా ఉన్నత
చదువుల కోసం రూ.27 లక్షల రిటర్న్స్ పొందొచ్చని చెబుతుంటారు. కానీ మీరు
ఎల్ఐసీ వెబ్‌సైట్‌లో చూస్తే ‘కన్యాదాన్’ పాలసీ కనిపించదు. మరి ఇదంతా మోసమా
అంటే మోసం కూడా కాదు. పాలసీ పేరు మాత్రం వేరు.

3. ఎల్ఐసీలో ఉన్న జీవన్ లక్ష్య పాలసీనే కన్యాదాన్ పాలసీగా ప్రచారం
చేస్తుంటారు. పేరు మాత్రమే వేరు. బెనిఫిట్స్ మాత్రం దాదాపుగా అవే. అయితే
ఎక్కడ కూడా రోజుకు రూ.121 పొదుపు చేస్తే రూ.27 లక్షలు రిటర్న్స్ వస్తాయన్న
ఉదాహరణ లేదు.

4. ఎల్ఐసీ వెబ్‌సైట్‌లో ఉన్న జీవన్ లక్ష్య పాలసీ సేల్స్ బ్రోచర్‌లో ఉన్న
వివరాలు చూద్దాం. ఎల్ఐసీ జీవన్ లక్ష్య నాన్ లింక్డ్, పార్టిసిపేటింగ్,
ఇండివిజ్యువల్ ప్లాన్ ఇది. ఇందులో కనీసం రూ.1,00,000 బీమా ఎంచుకోవాలి.
గరిష్టంగా ఎంతవరకైనా పాలసీ తీసుకోవచ్చు.

5. పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 18 ఏళ్లు. గరిష్టంగా 50 ఏళ్ల వయస్సు
ఉన్నవారు పాలసీ తీసుకోవచ్చు. పాలసీ మెచ్యూరిటీ వయస్సు గరిష్టంగా 65 ఏళ్లు.
ఇక పాలసీ గడువు 13 ఏళ్ల నుంచి 25 ఏళ్లు ఉంటుంది.

6. మెచ్యూరిటీ సమయంలో సమ్ అష్యూర్డ్‌తో పాటు బోనస్ కూడా లభిస్తుంది.
యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ కూడా ఉంది. ఎల్ఐసీ జీవన్ లక్ష్య పాలసీలో ఎంత
పొదుపు చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయో ఎల్ఐసీ వివరించింది.

7. ఉదాహరణకు 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ.1,00,000 సమ్ అష్యూర్డ్‌తో 25
ఏళ్లకు పాలసీ తీసుకుంటే 22 ఏళ్లు ప్రీమియం చెల్లిస్తే చాలు. మొదటి ఏడాది
ట్యాక్స్‌తో కలిపి రూ.4677 చెల్లించాలి.

8. రెండో ఏడాది నుంచి 21 ఏళ్లు రూ.4577 చొప్పున చెల్లించాలి. 22 ఏళ్లకు
చెల్లించే ప్రీమియం రూ.1,00,794 అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో రూ.1,00,000
సమ్ అష్యూర్డ్+రూ.1,22,500 బోనస్+రూ.33,000 ఫైనల్ అడిషనల్ బోనస్ వస్తుంది.
అంటే మొత్తం రూ.2,55,500 వస్తుంది.

9. ఒకవేళ రూ.10,00,000 సమ్ అష్యూర్డ్‌తో ఇదే కాలానికి పాలసీ తీసుకుంటే
మొదటి ఏడాది ప్రీమియం రూ.43,638, ఆ తర్వాత ఏడాది నుంచి రూ.42,699 చొప్పున
చెల్లించాలి. అంటే 22 ఏళ్లకు చెల్లించే ప్రీమియం రూ.9,40,317 అవుతుంది.

10. రిటర్న్స్ చూస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.10,00,000 సమ్
అష్యూర్డ్+రూ.12,25,000 బోనస్+రూ.4,50,000 ఫైనల్ అడిషనల్ బోనస్ వస్తుంది.
మొత్తం కలిపి రూ.26,75,000 వరకు పొందొచ్చు.

11. మార్కెట్‌లో ఎల్ఐసీ జీవన్ లక్ష్య పాలసీనే ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ
పేరుతో ప్రచారం చేస్తుండటంతో బాగా పాపులర్ అయింది. మధ్యతరగతి ప్రజల్లో
అమ్మాయి పెళ్లికి, ఉన్నత చదువులకు డబ్బులు పొదుపు చేయడం అలవాటే. అందుకే అదే
లక్ష్యంతో ఈ పాలసీలో పొదుపు చేయాలంటూ ప్రచారం చేస్తున్నారు.

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this