Corona Virus: కోవిడ్‌ దడ.. విద్యాసంస్థల మూత?!

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Corona Virus: కోవిడ్‌ దడ.. విద్యాసంస్థల మూత?!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
  • పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు 
  • విద్యాసంస్థల మూసివేతకు సమాలోచనలు 
  • ఆలయాల్లో ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు 
  • సొంతూళ్లకు వెళుతున్న ఉత్తరాది కార్మికులు

మహమ్మారి
మళ్లీ విజృంభిస్తోంది.. కరోనా వేవ్‌ క్రమేణా పెరుగుతోంది.. పాజిటివ్‌
కేసుల సంఖ్య అధికమవుతోంది.. ఈ క్రమంలో కోవిడ్‌ కట్టడికి ప్రభుత్వం చర్యలు
చేపడుతోంది.. విద్యాసంస్థల మూసివేత దిశగా సమాలోచనలు జరుపుతోంది.. ఆలయాల్లో
పలు ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోంది.. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల
ప్రచారంలో నిబంధనలను తప్పనిసరి చేసింది.

సాక్షి ప్రతినిధి, చెన్నై :
రాష్ట్రంలో కరోనా కలవరం మళ్లీ మొదలైంది. చికిత్స పొందుతున్నవారి సంఖ్య
సుమారు 8వేలకు చేరుకుంటోంది. 9 జిల్లాలో మరణాలు సైతం నమోదవుతుండడం ఆందోళన
కలిగిస్తోంది. ముఖ్యంగా చెన్నైనలో వారంలోపే 5.5శాతం కరోనా పాజిటివ్‌ కేసులు
పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.  రాష్ట్రంలో నిర్వహిస్తున్న
ప్రతి వంద కోవిడ్‌ పరీక్షల్లో రెండు పాజిటివ్‌ కేసులు వస్తున్నట్లు
ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి రాధాకృష్ణన్‌ సోమవారం వెల్లడించడం
గమనార్హం. 

విద్యాసంస్థల మూత? 
లాక్‌డౌన్‌ కారణంగా గత ఏడాది మార్చిలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు
మూతపడ్డాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో 9,10,11,12 తరగతుల కోసం 3 నెలల
క్రితమే విద్యాసంస్థలను ప్రారంభించారు. మళ్లీ పాజిటివ్‌ కేసుల
పెరుగుతుండడంతో 9,10,11 తరగతులకు ఆన్‌లైన్‌ క్లాసులు మొదలెట్టారు. 12వ
తరగతి విద్యార్థులకు మాత్రమే ఆఫ్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇవి
కూడా ఆన్‌లైన్‌కే మార్చేయాలని ఉన్నత విద్యాశాఖ భావిస్తోంది.  ఈక్రమంలో ఆ
శాఖ సంచాలకులు వివిధ వర్సిటీల వైస్‌ చాన్సలర్లతో సోమవారం సమావేశయమ్యారు.
ప్రస్తుత పరిస్థితుల్లో తరగతులు నిర్వహించాలా..? లేదా విద్యాసంస్థలను
మూసివేయాలా..? అనే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగు ఉత్తర్వులు జారీ
చేయనున్నట్లు సమాచారం. 

ఆలయాల్లో ఆంక్షలు   
కరోనా కట్టడిలో భాగంగా ఆలయాల్లో  తీర్థప్రసాదాల వితరణ, అర్చనపై నిషేధం
విధించారు. పంగుణి మాసంలో నిర్వహించే ఉత్సవాల్లో పెద్దసంఖ్యలో భక్తులు
పాల్గొంటారు. ముఖ్యంగా 28వ తేదీన పంగుణి ఉత్తిరాం రోజును పురస్కరించుకుని
పెరుమాళ్, అమ్మవారు, మురుగన్‌న్, శివాలయాల్లో విశేష ఉత్సవాలు
నిర్వహిస్తారు. అయితే కరోనా ప్రబలుతున్న తరుణంలో కఠినంగా ఆంక్షలు అమలు
చేయాలని దేవదాయ, ధర్మాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా కలకలం 
చెన్నై పెరుంగుడి మండలంలోని ఓ ఐటీ సంస్థలో 40 మంది ఉద్యోగులు కరోనా
బారినపడ్డారు. ఈ క్రమలో ఈ ఐటీ సంస్థకు చెందిన తరమణి, పెరుంగుడి,
కందన్‌చావడిల్లో శాఖలను మూసివేయాలని కార్పొరేషన్‌ అధికారులు ఆదేశించారు.
రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారనే ప్రచారం ముమ్మరం కావడంతో
 ఉత్తరాది కార్మికులు సొంతూరి బాట పడుతున్నారు.  

అభ్యర్థుల్లో ఆందోళన 
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులకు కరోనా సోకింది.
చెన్నై వేలాచ్చేరీ మక్కల్‌ నీది మయ్యం అభ్యర్థి సంతోష్‌బాబు కోవిడ్‌
చికిత్స పొందుతున్నారు. అదే పార్టీకి చెందిన అన్నానగర్‌ అభ్యర్థి
పొన్‌రాజ్‌ హోం క్వారంటైన్‌కు వెళ్లారు.  సేలం దక్షిణం నుంచి పోటీచేస్తున్న
డీఎండీకే అభ్యర్థి అళగాపురం మోహన్‌రాజ్‌కు పాజిటివ్‌ రావడంతో సోమవారం
చెన్నైలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో జాయిన్‌ అయ్యారు. ఈ క్రమంలో విధిగా
మాస్క్‌లు ధరించే ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు
జారీ చేసింది. అలాగే చెన్నైలో కోవిడ్‌ విధులు నిర్వర్తించేందుకు వైద్యులు
సైతం విముఖత చూపుతున్నారు. బలవంతంగా బాధ్యతలు అప్పగిస్తే ఆందోళనకు
దిగుతామని తమిళనాడు ప్రభుత్వ వైద్యుల సంఘం ఇప్పటికే ప్రకటించింది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this