SBI Customer Alert: స్టేట్ బ్యాంక్ ఆఫ్...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

SBI Customer Alert: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన.. ఆ మూడు గంటలు సేవలు బంద్…

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

SBI request: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక
ప్రకటన జారీ చేసింది. తమ వినియోగదారులను అలర్ట్ చేసింది. ఖాతాదారులు ఈ
రోజు సుమారు మూడున్నర గంటలపాటు ఎస్‌బీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను
పొందలేరని తెలిపింది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ అప్‌గ్రేడ్ వల్ల ఇంటర్నెట్
బ్యాంకింగ్, యోనో యాప్, యోనో లైట్ యాప్ ద్వారా సేవలు కొంత సమయం వరకు
నిలిపివేస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. కస్టమర్లు గురువారం ఏవైనా
ముఖ్యమైన లావాదేవీలు ఉంటే మధ్యాహ్నం 2 గంటల్లోగా పూర్తి చేసుకోవాలని
కోరింది. లేదంటే సాయంత్రం 5.40 తర్వాత లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలి
వెల్లడించింది.

ఈ మేరకు ఎస్‌బీఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వినియోగదారులకు సూచించింది.
బ్యాంకులో ముఖ్యమైన పనులుంటే తొందరగా ముగించుకోవాలని పేర్కొంది. ఎస్‌బీఐ
పేర్కొన్న పోస్ట్ లో “ఈ రోజు మధ్యాహ్నం 1.10 నుంచి సాయంత్రం 5.40 గంటలకు
ఎస్‌బీఐ బ్యాంకింగ్, యాప్ సేవలు ఉపయోగించుకోలేరు.”  ఎస్‌బీఐ ఆన్‌లైన్
బ్యాంకింగ్ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేస్తున్నందున బ్యాంకు కార్యకలాపాలు
నిలిచిపోతాయాని తెలిపింది. ఇందుకు తమ కస్టమర్లు సహకరించాలని కోరింది.

ఆన్‌లైన్ బ్యాంకింగ్ విషయంలో కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు
మెయింటనెన్స్‌ పనులు చేస్తామని, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌ను
అప్‌గ్రేడ్ చేస్తున్నామని ఎస్‌బీఐ ప్రకటించింది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this