Diet After Corona Vaccine: కోవిడ్ వ్యాక్సిన్...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Diet After Corona Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నవారికి డైట్ చార్ట్‌ .. ఏ సమయంలో ఏమి తినాలో సూచించిన పౌష్టికార నిపుణులు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Coronavirus Vaccine: కరోనా కల్లోలం ప్రపంచ
వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. ఇక భారత్ లో కోవిడ్ అదుపులోకి వచ్చింది అని
సంతోషించినంత సేపు లేదు.. తగ్గినట్లు తగ్గి.. మల్లి కొన్ని ప్రాంతాల్లో
సెకండ్ వేవ్ కొనసాగుతూ.. భారీగా కేసులు నమోదవుతున్నాయి. అయితే మరోవైపు
కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. తాజాగా 45 ఏళ్ల
లోపువారికి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు.. అయితే ఈ వ్యాక్సిన్
తీసుకున్నవారు కొన్ని నియమనిబంధనలు పాటించాలని వైద్య బృందం కోరుతుంది.
తినే తిండి దగ్గరనుంచి వేసుకునే మందుల వరకూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని
సూచిస్తుంది.

ఎందుకంటే టీకా తీసుకున్న కొందరిలో జ్వరం, కండరాల నొప్పి, ఒళ్లు నొప్పులు
తదితర లక్షణాలు కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్‌ ప్రభావంతో శరీరంలో వేడి
పెరిగి, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. అందుకని
వ్యాక్సిన్ తీసుకున్న వారు . సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా
వ్యాక్సిన్‌ తర్వాత సూప్స్‌ తీసుకోవాలి. నీళ్లు, పండ్ల రసాలు వంటి ద్రవ
పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే వేడి తగ్గుతుంది.

వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత జలుబు చేస్తే.. పసుపు, ఉప్పు, మిరియాల
పొడి వేసి చేసిన చికెన్‌ సూప్‌ తాగితే ఉపశమనం ఉంటుంది. అదే శాకాహారులు
క్యారెట్‌, బీన్స్‌, పాలకూర, బ్రకోలీ, క్యాప్సికమ్‌, పుట్టగొడుగు సూప్‌
తాగొచ్చు.

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నవారికి డైట్ చార్ట్‌ : ‌

  • ఉదయం 6 గంటలకు : నానబెట్టిన ఐదు బాదం గింజలు, కొన్ని ఎండుద్రాక్షలు
  • అల్లం-నిమ్మగడ్డితో చేసిన టీ ‌
  • 8 గంటలకు : కివీ పండు, తీసుకునే అల్పాహారంలో జీలకర్ర పచ్చిమిర్చి పుదీనా ఉండేలా చూసుకోవాలి
  • 11 గంటలకు: టమాటా, క్యారెట్ సూప్ పసుపు, పెప్పర్ పౌడర్ తప్పనిసరిగా వేసుకోవాలి.
  • లంచ్ : రైస్, నిమ్మరసంతో సలాడ్‌, అవిసె గింజల పొడి , జీలకర్ర పొడి వేసిన మజ్జిగ,
  • స్నాక్స్ సమయంలో : రెండు వాల్‌నట్స్‌, రెండు ఖర్జూరాలు, ఒక గ్లాస్‌ పుచ్చకాయ రసం.
  • సాయంత్రం : దానిమ్మ గింజలు, గుమ్మడి గింజలు
  • డిన్నర్ : నిమ్మరసంతో మొలకల సలాడ్‌, కూరగాయలు పప్పుతో చిరుధాన్యాల కిచిడి
  • ఇక నిద్రపోయే ముందు తప్పని సరిగా పాలల్లో పసుపు కలిపినవి తాగాలి.

అయితే రాత్రి భోజనం ఎంత త్వరగా చేస్తే అంత మంచిది.. అంతేకాదు..సమయానికి నిద్రపోవాలి.

diet after corona vaccine: కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నవారికి డైట్ చార్ట్‌ .. ఏ సమయంలో ఏమి తినాలో సూచించిన పౌష్టికార నిపుణులు


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this