Education loans: ఉన్నత విద్య కోసం రుణాలు...

AP Inter Results 2026 Today Live: Direct Links for 1st & 2nd Year Results, WhatsApp Mana Mitra Process, SMS Method

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

Education loans: ఉన్నత విద్య కోసం రుణాలు అందజేస్తున్న బ్యాంకులు ఇవే.. వడ్డీకి ట్యాక్స్‌ మినహాయింపు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Bank Education loans: ప్రస్తుతం విద్య కోసం లక్షల్లో ఖర్చు అవుతుంటాయి.
పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు సంపాదించింది ఎక్కువగా విద్య కోసమే
ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆదాయంతో పాటు ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్బణం, ఇతర
కారణాలతో ఉన్నత విద్యకు కేటాయించాల్సిన మొత్తం వార్షిక ఆదాయంలో 13శాతం వరకు
ఖర్చు చేస్తున్నారని ఒక సర్వే తేల్చింది. ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలున్న
కుటుంబాలు ఇంకా ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోంది. వీటిని భర్తీ చేయడానికి
చాలా మంది తల్లిదండ్రులు విద్యా రుణాలు (ఎడ్యుకేషన్ లోన్లు)
తీసుకుంటున్నారు.

ఎడ్యుకేషన్‌ లోన్లకు పెరుగుతున్న ఆదరణ

ప్రస్తుతం మన దేశాల్లో చదువులకు కూడా అన్ని బ్యాంకులు రుణాలు
అందజేస్తున్నాయి. ఎడ్యుకేషన్‌ లోన్లు తల్లిదండ్రులు లేదా విద్యార్థులు
తీసుకోవచ్చు. కోర్సు పూర్తయిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత రుణ
మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. ఇలాంటి సౌకర్యం ఉంది కాబట్టి ఎడ్యుకేషన్‌
లోన్లకు ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులు 7 శాతం కంటే
తక్కువ వడ్డీతో ఎడ్యుకేషన్‌ రుణాలు ఇస్తున్నాయి. యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌
ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వంటి బ్యాంకులు
వరుసగా 6.8 శాతం, 6.85 శాతం వడ్డీతో విద్యారుణాలు మంజూరు చేస్తున్నట్లు
తెలుస్తోంది. ప్రైవేటు బ్యాంకుల్లో ఇది పది శాతం వరకు ఉంది. ఇక
హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకులు 9.55 శాతం, 9.70శాతం,
10.50 శాతం వడ్డీ విధిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ బ్యాంకుల్లో యూనియన్‌
బ్యాంకు ఆఫ్‌ ఇండియా అతి తక్కువగా 6.8 శాతంతో ఎడ్యుకేషన్‌ లోన్లు
ఇస్తుండగా, ఇండియన్‌ బ్యాంకు అత్యధికంగా 7.15 శాతం వడ్డీ అందిస్తోంది.

కాగా, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో వడ్డీ రేట్లలో రెండు శాతం వరకు
తేడాలు ఉన్నాయి. ఈ కారణంగా వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చి, తక్కువ
వడ్డీ రేట్లు ఉన్న బ్యాంకులను ఎడ్యుకేషన్‌ లోన్‌ కోసం ఎంచుకోవాలి. పర్సనల్‌
లోన్లు, విద్యారుణాల కాలపరిమితిలో (లోన్‌ టెన్యూర్‌) తేడాలు ఉంటాయి.
సాధారణంగా బ్యాంకుల్లో పర్సనల్‌ లోన్లు తీసుకునేవారికి ఐదు నుంచి ఏడు
సంవత్సరాల వరకు కాలపరిమితి ఉంటుంది. కానీ ఎడ్యుకేషన్‌ లోన్లకు అత్యధికంగా
15 సంవత్సరాల వరకు కాలపరిమితి ఉంటుంది. ఈ సౌలభ్యం కారణంగా ఎక్కువ మంది
తల్లిదండ్రులు, విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఎడ్యుకేషన్‌
లోన్లను ఎంచుకుంటున్నారు.

వడ్డీకి ట్యాక్స్‌ మినహాయింపు

కాగా, ఎడ్యుకేషన్‌ రుణాలపై చెల్లించే వడ్డీకి ట్యాక్స్‌ మినహాయింపు కూడా
ఉంటుంది. లోన్‌ తిరిగి చెల్లించడం ప్రారంభించిన ఏడాది నుంచి 8 ఏళ్ల వరకు
మాత్రమే లభిస్తుంది. అందుకే రుణాలు తీసుకున్న వారు ఎనిమిదేళ్లుగా గడువు
పెట్టుకుంటే ట్యాక్స్‌ మినహాయింపుల ద్వారా ఎక్కువ లబ్ది పొందవచ్చు. ఇంకో
విషయం ఏంటంటో ఎడ్యుకేషన్‌ లోన్‌ అసలు మొత్తంపై ఎలాంటి మినహాయింపులు ఉండవు.
కేవలం వడ్డీపై మాత్రమే ట్యాంక్స్‌ మినహాయింపు ఉంటుందని కస్టమర్ల
గుర్తించుకోవాలి.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this