Electric Bike: ఈ బైక్‌ 17 రూపాయిల‌తో...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Electric Bike: ఈ బైక్‌ 17 రూపాయిల‌తో 116 కిలోమీట‌ర్ల ప్రయాణం.. అద్భుతమైన ఫీచర్లతో ఎలక్ట్రిక్‌ బైక్‌

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Electric Bike: దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఎక్కువ
మంది ఆసక్తి చూపుతున్నారు. రోజురోజుకు పెట్రోల్, డీజిల్‌ ధరలు
పెరుగుతండటంతో చాలా మంది ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.
అందుకు తగ్గట్లుగా పలు స్టార్ట్‌ఆఫ్‌ కంపెనీలు కూడా వినూత్నంగా ఆలోచిస్తూ
ఎలక్ట్రికల్‌ బైక్‌లను అందుబాటులోకి తీసుకుందుకు సిద్ధమవుతున్నాయి.
ఇప్పటికే పలు రకల ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులో ఉన్న అవి మరి కాస్త
సాన్యుల వరకు అందడం లేదు. తాజాగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను దృష్టిలో
ఉంచుకుని ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన ప్యూర్‌ ఈవీ (Puer EV) అనే సంస్థ
హైస్పీడ్‌ మోటారు బైకులు రూపొందించింది. కేవలం ఒకసారి చార్జీంగ్‌ చేస్తే
దాదాపు 116 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా తయారు చేసినట్లు కంపెనీ
ప్రతినిధులు తెలిపారు. కేవలం ఒకసారి చార్జీంగ్‌ చేయడం కోసం మనకు అయ్యే
పవర్‌ ఖర్చు కూడా చాలా తక్కువే. ఒకసారి చార్జీంగ్‌ చేస్తే 17 రూపాయలు
మాత్రమే ఖర్చు అవుతుందని కంపెనీ చెబుతోంది. కేవలం ఐదు సెకన్లలోనే దాదాపు 40
కిలోమీటర్ల స్పీడ్‌ను ఈ బైక్‌ అందుకోగలదు. దీంతో పాటు గంటకు 60 కిలోమీటర్ల
గరిష్ట వేగంతో 116 కిలోమీటర్లు ప్రయాణిస్తుందంటున్నారు. రిగ్యూల‌ర్ బైక్
లు వెళ్లే స్పీడ్ ఈ బైక్ వెళ్లుతుంది. 2.5 కేడ్ల్యూహెచ్ లిథియోమ్ బ్యాటరీ
ప్యాక్ వ‌చ్చే ఈ బైక్ ఫుల్ చార్జ్ చేయ‌డానికి నాలుగు గంట‌లు ప‌డుతుంది.
ఫుల్ చేస్తే కేవ‌లం 2.5 ప‌వ‌ర్ యూనిట్లు మాత్రమే ఖ‌ర్చు అవుతాయ‌ని సంస్థ
యాజ‌మానులు చెబుతున్నారు.

ఈ బైక్‌ ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.79,999

ప్రస్తుతం మార్కెట్లో బుకింగ్స్‌ కూడా జరుగుతున్నాయట. దీని ఎక్స్‌
షోరూమ్‌ ధర రూ.79,999గా ఉందని కంపెనీ పేర్కొంది. ఐదేళ్ల వారంటీతో పాటు
వచ్చే ఈ బైక్‌ తీసుకోవడానికి పలు బ్యాంకులు రుణ సౌకర్యం కూడా
అందిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాటరీ వాహనాలు అంఏనే చార్జింగ్‌ షాకేట్‌లలో
ప్రధానమైన సమస్యలు ఉంటాయి. మనం నిత్యం గృహావసరాల కోసం ఉపయోగించే
షాకేట్స్‌తో చార్జ్‌ చేసుకోవడం కుదరదు. కానీ ఈబైక్‌లకు రెగ్యులర్‌
ఎలక్ర్టికల్‌ బైక్‌లకు అవసరమైన 25 యాంప్‌ అవసరం లేదు. సాధార‌ణ‌మైన గృహా
అవ‌స‌రాల‌కు ఉప‌యోగించుకునే షాకెట్ ద్వారానే మ‌నం ఈ బైక్ ను చార్జ్
చేసుకోవ‌చ్చు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this