Summer Holidays: విద్యార్థులకు రెండు నెలలు వేసవి...

AP Inter Results 2026 Today Live: Direct Links for 1st & 2nd Year Results, WhatsApp Mana Mitra Process, SMS Method

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

Summer Holidays: విద్యార్థులకు రెండు నెలలు వేసవి సెలవులు.. ఉత్తర్వులు జారీచేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కరోనా కేసులు భారీగా
పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో స్కూల్స్ మూసివేసిన సంగతి
తెలిసిందే. అలాగే చాలా రాష్ట్రాల్లో బోర్డ్ ఎగ్జామ్స్‌ను వాయిదా వేశారు.

కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో
స్కూల్స్ మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ ప్రభుత్వం
కీలక నిర్ణయం తీసుకుంది. ఒకటి నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు
రెండు నెలల పాటు వేసవి సెలవులను ప్రకటించింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర
విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పార్మర్ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
విద్యార్థులు ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన
తెలిపారు. అయితే అదే సయమంలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు బోధిస్తున్న ప్రభుత్వ
ఉపాధ్యాయులు వేసవి సెలవుల కాలంలో బోర్డ్ పరీక్షలు పూర్తయ్యేంతవరకూ వాళ్లు
పోస్టింగ్‌లో ఉన్న హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని విద్యాశాఖ
పేర్కొంది. ఎందుకంటే బోర్డ్ ఎగ్జామ్స్ సందర్భంగా టీచర్స్ విధులు
నిర్వర్తించాల్సిన అవసరం ఉండొచ్చని తెలిపింది.

ఇక, మంగళవారం జారీచేసిన ఆ ఉత్తర్వుల ప్రకారం.. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలలో
ఒకటి నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరి 15 నుంచి జూన్ 13వ
తేదీ వరకూ సెలవులను ప్రకటించారు. ఏప్రిల్ చివరి వరకూ ఆన్‌లైన్ బోధన
చేసుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు హాస్టల్స్‌ను
తక్షణమే మూసివేయాలని విద్యాశాఖ మంత్రి ఆదేశించారు. ఈ మేరకు స్కూల్
ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు,
విద్యాధికారులు, జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్లు, ప్రినిపాల్స్‌కు
మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

మరోవైపు కోవిడ్ కేసులు పెరుగుతున్న
నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో జరగాల్సిన పదో తరగతి, 12వ తరగతి బోర్డ్
ఎగ్జామ్స్‌ను వాయిదా వేస్తున్నట్టు ఓ అధికారి బుధవారం తెలిపారు. ఇక,
మంగళవారం మధ్యప్రదేశ్‌లో కొత్తగా 8,998 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక,
రాష్ట్రంలో మొత్తం కోవిడ్ మృతుల సంఖ్య 4,261కి చేరింది. ప్రస్తుతం
రాష్ట్రంలో 43,539 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this