Thursday, February 19, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
AP Tenth, Inter Exams: ఏపీ టెన్త్,...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

AP Tenth, Inter Exams: ఏపీ టెన్త్, ఇంటర్ సహా పలు పరీక్షలపై సీఎం జగన్ కీలక నిర్ణయం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

AP Tenth, Inter Exams: నేడు పలు అంశాలపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. పరీక్షల నిర్వహణపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.

ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయా ? లేక కరోనా తీవ్రత
కారణంగా రద్దవుతాయా ? అన్న దానిపై కొద్దిరోజులుగా డైలమా కొనసాగుతోంది.

కేంద్రంతోపాటు పలు రాష్ట్రాలు సైతం పరీక్షలను రద్దు చేయడంతో ఏపీ ప్రభుత్వం కూడా అదే తరహా నిర్ణయం తీసుకుంటుందని చాలామంది భావించారు.

కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం పదో తరగతి, ఇంటర్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే
నిర్వహిస్తామని ప్రకటించింది. దీనిపై ఏపీలోని పలు రాజకీయ పార్టీ అభ్యంతరం
వ్యక్తం చేశాయి.

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని.. పరీక్షలను వాయిదా లేదా రద్దు చేయాలని డిమాండ్ చేశాయి.

దీనిపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ విద్యాశాఖ మంత్రి సురేశ్
ప్రకటించారు. దీంతో ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం పునరాలోచన చేయనుందనే ప్రచారం
జరిగింది.

అయితే నేడు పలు అంశాలపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. పరీక్షల నిర్వహణపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.

ఏపీలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.

విద్యార్థులకు నష్టం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

పరీక్షల నిర్వహణలో ఎక్కడా నిర్లక్ష్యం చూపొద్దని ఆయన అధికారులను ఆదేశించారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this