Corona Warning: ప్రస్తుతం భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విశ్వరూపం చూపిస్తోంది.. ఫస్ట్ వేవ్‌లో కంటే తీవ్రంగా.. కేసులు పెరుగుతున్నాయి.. మరణాలు పెరిగాయి.. ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా వైరస్ ఎటాక్ చేస్తోందో తెలియని పరిస్థితి.. కానీ, ఇది ఇంతటి అయిపోలేదు.. థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ ను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. దేశంలో కేవలం కోవిడ్ సెకండ్ వేవ్‌ను మాత్రమే కాకుండా భవిష్యత్తులో థర్డ్, ఫోర్త్ వేవ్‌లు కూడా ఉంటాయని.. అందుకు సిద్ధమై ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను పెంచుకోవాలని రాష్ట్రాలకు సూచించారు గడ్కరీ.. ఇక, ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన ఆయన.. వైరస్ గురించి ఆందోళన చెందకుండా ప్రభుత్వాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.. కరోనా చికిత్సలో భాగంగా ఉపయోగించే ఔషధాల కొరతను తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని .. రెమ్‌డెసివిర్‌కు పెరుగుతున్న డిమాండ్ రీత్యా ఉత్పత్తిని కూడా పెంచేందుకు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
Corona Warning: కోవిడ్ థర్డ్, ఫోర్త్ వేవ్‌కు సిద్ధంగా ఉండండి.. కేంద్ర మంత్రి వార్నింగ్..
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.
