Fake Remdesivir: ఇంజక్షన్ లోనూ నకిలీ.. ఖాళీ...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Fake Remdesivir: ఇంజక్షన్ లోనూ నకిలీ.. ఖాళీ రెమిడెసివర్‌ బాటిల్ లో సెలైన్ నింపి మోసం.. పోలీసులు రంగప్రవేశంతో..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Fake Remdesivir: మోసానికి కాదేది హ‌న‌ర్హం అన్న‌ట్టుగా ఓ వైద్యుడు ఏకంగా రెమిడెసివర్‌ ఇంజ‌క్ష‌న్ నే న‌కిలీది త‌యారు చేశాడు. ఖాళీ రెమిడెసివర్‌ బాటిల్ లో సెలైన్ వాట‌ర్ నింపి క్యాష్ చేసుకుంటున్నారు. నిజామాబాద్‌లో వైద్యుడు, ఓ కాంపౌండర్‌ కలిసి ఈ భారీ మోసానికి పాల్పడుతున్నారు. బాధితుల నుంచి భారీగా నగదు తీసుకుని ఈ నకిలీ వ్యాక్సిన్‌ అమ్ముతున్నారు.

ఓ వైపు కరోనా ఉగ్రరూపం దాల్చుతుంటే మరోవైపు ఇదే అదునుగా భావించి నకిలీ గాళ్లు పేట్రేగిపోతున్నారు. శానిటైజర్ దగ్గర నుంచి రెమిడెసివర్‌ వరకు మొత్తం నకిలీవి తయారు చేస్తున్నారు. ప్రజల్లో భయాందోళనలను వీరికి అనువుగా మార్చుకొని అమాయకులను మోసం చేస్తున్నారు. వారి మాయలో పడి ప్రాణాన్ని కాపాడుకోవాలనే తొందరలో అడిగినంత డబ్బు కట్టి నకిలీవి కొంటున్నారు. తీరా మోసం జరిగిందని తెలిసి పోలీసులును ఆశ్రయిస్తున్నారు. ఇవన్ని ఈ రోజుల్లో సర్వ సాధారణం అయిపోయాయి. కోవిడ్‌ నుంచి రక్షించుకునేందుకు వ్యాక్సిన్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అదునుగా చేసుకుని కొందరు మోసగాళ్లు క్యాష్‌ చేసుకున్నారు. తాజాగా ఖాళీ రెమిడెసివర్‌ బాటిల్స్‌లో సెలైన్‌ వాటర్‌ నింపి వ్యాక్సిన్‌గా విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నిజామాబాద్ జిల్లాలకు చెందిన రంజీత్ కుమార్ అన్న‌కు కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింది. అయితే న‌గ‌రంలోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ ఆసుప‌త్రి వైద్యుడు ఆత‌నికి ఆరు రెమిడెసివర్‌ ఇంజెక్క్షన్ లు ఆవ‌సరమవ్వాగా మావ‌ద్ద లేవు మీరే తెచ్చుకోవాల‌ని చెప్పాడు. దీంతో రంజిత్ కుమార్ త‌న‌కు తెలిసిన వారి వద్ద తీసుకు వ‌స్తాను అని చెప్పాడు. అత‌నికి తెలిసిన మేల్ న‌ర్స్ స‌తీష్ గౌడ్ ను క‌లిశాడు. అయితే స‌తీశ్ గౌడ్ , ఓ ప్రైవేట్ ఆసుప‌త్రి వైద్యుడు సాయిక్రిష్ణ నాయుడు వ‌ద్ద ఉన్నాయ‌ని చెప్పాడు. వెంట‌నే సాయికృష్ణ డాక్ట‌ర్ ను క‌లిశారు. అయితే ఒక్కో ఇన్ జ‌క్ష‌న్ రూ.30వేలు అని చెప్పాడు.. అయినా స‌రే అని మూడు రెమిడెసివర్‌ కు రూ.90 వేలు చెల్లించి తీసుకువెళ్లాడు.

అయితే వాటిని ప‌రిశీలించిన వైద్యుడు న‌కీలీవ‌ని చెప్ప‌డంతో తిరిగి వాపస్ ఇచ్చేశాడు. అయితే మా డ‌బ్బులు మాకు తిరిగి ఇవ్వాలని కోరారు.. అయితే సాయికృష్ణ త‌న వ‌ద్ద ఇంకా వేరేవీ కూడా ఉన్నాయని చెప్పి మ‌రో రెండు రెమిడెసివర్‌ లు ఇచ్చాడు. అవి కూడా డుప్లీకేట్ అని తేలింది. దీంతో బాధిడుతు రంజీత్ కుమార్ ఒక‌ట‌వ టౌన్ పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. దీంతో పోలీసులు విచార‌ణ చేపట్టారు. సాయికృష్ణ‌, స‌తీష్ గౌడ్ ను విచారించారు. వారి వ‌ద్ద నుంచి ఆరు రెమిడెసివర్‌ ఇంజెక్క్షన్ రిక‌వ‌రి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this