Fraud: గుడ్ బిజినెస్.. మొబైల్ అప్లికేషన్స్ లో...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Fraud: గుడ్ బిజినెస్.. మొబైల్ అప్లికేషన్స్ లో పెట్టుబడి.. డబుల్ ఆదాయం అంటూ కుచ్చుటోపీ..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Fraud: సైబర్ నేరగాళ్లు రోజుకో పంతా ఎంచుకొని అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు. వారి వలలో పడిన వీరు మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటిదే ఒకటి హైదరాబాద్ లో చోటుచేసుకుంది. మొబైల్ అప్లికేషన్స్ లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పడంతో మోసపోయారు.

మోసపోయేవాళ్లు ఉంటే మోసం చేసేవాళ్లు ఉంటూనే ఉంటారు. ఓ ప్రముఖ చానల్ లో పనిచేస్తున్న యువతికి మాయ మాటలు చెప్పి మోసపోయి నగదు పోగొట్టుకుంది. ఇలా రోజుకు నగరంలో పోలీస్ స్టేషన్లలో ఏడు నుంచి ఎనిమిది ఫిర్యాదులు వస్తున్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. సైబర్‌ నేరగాళ్లు మొబైల్‌ అప్లికేషన్స్‌లో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి పలువురి నుంచి రూ. 14 లక్షలు కొల్లగొట్టారు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన సంఘటనల్లో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లో ఓ చానెల్‌లో పనిచేస్తున్న యువతికి గుర్తుతెలియని నంబర్‌ నుంచి ఓ వాట్సాప్‌ లింక్‌ వచ్చింది. మొదట దానిని పట్టించుకోలేదు. ఆ తర్వాత ఓ వ్యక్తి ఫోన్‌ చేసి ఆ లింక్‌ గురించి చెప్పాడు. ప్రస్తుతం కరోనా వేళ ఉద్యోగాలు లేక చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారని.. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుందని నమ్మ బలికి.. మార్కెట్లో మొబైల్‌ యాప్స్‌కు విపరీతమైన డిమాండ్‌ ఉందని, వాటిలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలుంటాయని నమ్మించాడు. మీరు పెట్టిన డబ్బులకు రిటర్న్ ఏరోజుకారోజు ఉంటుందని తెలిపాడు.

అతని మాటలు నమ్మిన యువతి అతను చెప్పిన లింక్‌ ఓపెన్‌ చేసి తొలుత రూ. 10వేలు పెట్టుబడి పెట్టింది. వెంటనే రోజుకు రూ. వెయ్యి చొప్పున ఐదు రోజులు రిటర్న్స్‌ జమ చేశారు. ఇలా రిటర్న్ రావడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. అతడిని నమ్మింది. నాలుగు రోజుల తర్వాత ఆమెకు ఫోన్‌ చేసి ఎక్కువ మొత్తంలో పెడితే లాభాలు అధికంగా వస్తాయని నమ్మించారు. దాంతో ఆమె ఒకసారి రూ. 40వేలు, మరోసారి 50వేలు పెట్టింది. ఇలా విడతల వారీగా రూ. 5 లక్షలు పెట్టింది. మీకు తెలిసిన వారిని కూడా చేర్పిస్తే వారికి వచ్చే దానిలో మీకు కూడా కమీషన్ వస్తుందని చెప్పాడు. కానీ ఆమె ఎవ్వరినీ చేర్పించలేదు. ఆ తరువాత రోజు నుంచి డబ్బులు రావడం ఆగిపోయాయి. అనుమానం వచ్చి వెంటనే ఫోన్ చేసింది. వారి ఫోన్ స్విచాఫ్‌ రావడంతో మోసపోయానని గుర్తించి సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఇలా నమ్మే వరకు ఫోన్లు చేసి తర్వాత ఆవ చూపి బురిడీ కొట్టిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని మరో కేసులో కార్వాన్‌కు చెందిన హేమంత్‌ రూ. 1.10 లక్షలు మోసపోయి పోలీసులను ఆశ్రయించారు. ఇదే తరహాలో ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాడు.

నాలుగు రోజుల వరకు రిటర్న్స్ ఇచ్చి తర్వాత మొబైల్ ను స్విచ్చాఫ్ పెట్టుకున్నారు. ఈ తరహా కేసులపై 10 రోజుల వ్యవధిలో 8 ఫిర్యాదులు అందినట్లు పోలీసులు తెలిపారు. సైబర్‌ నేరగాళ్లు మొత్తం రూ. 14లక్షలు కొల్లగొట్టినట్లు సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కె.వి.ఎమ్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. వారిన త్వరలో పట్టుకొని సొత్తును రికవరీ చేస్తామని తెలిపారు. ఇటువంటి వారిపై జగ్రత్తగా ఉండాలని.. కష్టపడకుండా డబ్బులు రావని.. చదువుకున్న వాళ్లు కూడా ఇలాంటి మోసాలను నమ్మడం విడ్డూరంగా ఉందన్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this