Friday, February 20, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Fact Check: కరోనాతో మరణిస్తే రూ. 2...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Fact Check: కరోనాతో మరణిస్తే రూ. 2 లక్షల పరిహారం.. ఈ పథకంపై క్లారిటీ ఇదే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పిఎంజెజెబివై), ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (పిఎంఎస్బివై) పథకాలల్లో చేరి కరోనాతో మరిణించిన వారి కుటుంబ సభ్యులు రూ.2 లక్షలు క్లెయిమ్​ చేసుకోవచ్చనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వాస్తవాలు ఇలా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేనంతగా రోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. ఓ వైపు కరోనాతో ప్రజలు ఆందోళన చెందుతుండగా.. మరోవైపు నకిలీ వార్తలు రాజ్యమేలుతున్నాయి. కొంతమంది ఈ వార్త అసలైనదా? కాదా? అని నిర్థారించుకోకుండానే సోషల్​ మీడియాలో షేర్​ చేస్తున్నారు. ఇవి ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పిఎంజెజెబివై), ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (పిఎంఎస్బివై) పథకాలపై ఇలాంటి ఫేక్​ ప్రచారమే జరుగుతోంది. ఈ పథకాలల్లో చేరి కరోనాతో మరిణించిన వారి కుటుంబ సభ్యులు రూ.2 లక్షలు క్లెయిమ్​ చేసుకోవచ్చనే వార్త ఒకటి వాట్సాప్​ గ్రూప్​లలో చక్కర్లు కొడుతోంది. ఇది నిజమేనని నమ్మి చాలా మంది ఖాతాధారులు బ్యాంకులకు పరిగెత్తుతున్నారు.

ఇంతకీ వైరల్​ అవుతున్న పోస్ట్​లో ఏముందంటే.. “కోవిడ్–19 కారణంగా దగ్గరి బంధువు లేదా స్నేహితులు ఎవరైనా మరణించినట్లయితే వారి బ్యాంకు పాస్‌బుక్​ స్టేట్​మెంట్​ తనిఖీ చేయండి. దాంట్లో రూ. 12- లేదా రూ. 330- డిడక్షన్​ అయినట్లు కనిపిస్తే అతడు పీఎంజెజెబివై లేదా పీఎంఎస్​బీవై పథకాల్లో చేరినట్లేనని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి, ఈ పథకం కింద రావాల్సిన రూ. 2 లక్షల కవరేజీని సంబంధిత బ్యాంకుకు వెళ్లి క్లెయిమ్​ చేసుకోండి” అనేది అసలు సారాశం. అయితే వాట్సాప్​ గ్రూప్​లలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలో నిజమెంత? అనే దానిపై స్పష్టతనిచ్చింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి). ఈ రెండు పథకాలు కోవిడ్ మరణాలకు వర్తించవని, యాక్సిడెంట్​ లేదా శాశ్వత అంగవైకల్యం చెందిన సందర్భంలోనే వీటికి క్లెయిమ్​ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కోవిడ్​ మరణాలు ప్రమాదశాత్తు జరిగే మరణాలుగా పరిగణించరని తేల్చి చెప్పింది.

అసలు PMSBY పథకంలో చేరిన వారికి కరోనా డెత్​ క్లెయిమ్​ వర్తించదు. కానీ PMJJBY పథకంలో చేరిన వారి విషయంలో మాత్రం కొన్ని షరతులకు లోబడి డెత్​ క్లెయిమ్​ చేసుకోవచ్చని ఫ్యాక్ట్ చెక్ నివేదిక పేర్కొంది. తన పిఐబి ట్విట్టర్​ హ్యాండిల్ ద్వారా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్ట్‌లకు ప్రజలు బలైపోకూడదని విజ్ఞప్తి చేసింది.

PMSBY పథకం గురించి..

ప్రధాన మంత్రి జీవన్​ జ్యోతి బీమా యోజన పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్​ కార్పొరేషన్​, ఇతర జీవిత బీమా సంస్థలు అందిస్తున్నాయి. ఈ బీమా ప్రయోజనం అందించడం కోసం ఆయా బీమా సంస్థలు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. దేశ పౌరులందరికీ జీవిత బీమా ఉండాలనే సంకల్పంతో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. 2015 మే 9న ప్రధాన మంత్రి జీవన్​ జ్యోతి బీమా యోజన పథకాన్ని ప్రారంభించారు.

ఈ పథకం ఒక సంవత్సరం పాటు రూ.2 లక్షల జీవిత బీమాను అందిస్తుంది. ఈ బీమా తీసుకున్న వ్యక్తి ఒకవేళ మరణించినట్లైతే.. నామినీకి పూర్తి కవరేజీ అందజేస్తారు. ప్రధాన మంత్రి జీవన్​ జ్యోతి బీమా యోజన కోసం దరఖాస్తు చేసుకోవడానికి కస్టమర్లు రిజిస్ట్రేషన్​ ఫారమ్​ను నెట్​ నుంచి నేరుగా డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. లేదంటే బ్యాంకుల్లో ఫారమ్​ తీసుకోవచ్చు. ఈ క్రమంలో పేరు, సేవింగ్స్​ బ్యాంక్​ ఖాతా నంబర్​ ఈ–మెయిల్​ ఐడి, చిరునామా మొదలైన వివరాలతో ఫారంలో నింపాల్సి ఉంటుంది.

అర్హత, ప్రీమియం వివరాలు..

ఈ పథకంలో చేరడానికి 18 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారే అర్హులు. సంవత్సరానికి రూ.330 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతా ఉన్న ఏ వినియోగదారుడైనా ఈ పథకంలో లబ్ధిదారుడిగా చేరవచ్చు. ఏడాదికి ఒకసారి ఒకే మొత్తంలో రూ. 330 ప్రీమియం చెల్లించాలి. తద్వారా, వారికి రూ.2 లక్షల బీమా సదుపాయం లభిస్తుంది. ఒక్కసారి ఈ పథకంలో చేరితే ప్రతి సంవత్సరం ఈ అమౌంట్​ ఆటోమేటిక్​గా డెబిట్​ అవతుంది. అయితే, ఈ పథకంలో చేరేందుకు బ్యాంకులో ఖాతా తప్పనిసరిగా ఉండాలి. కస్టమర్​కి 50 ఏళ్ల వయస్సు దాటితే ఈ పాలసీ గడువు ఆటోమేటిక్​గా ముగుస్తుంది. 2020 సెప్టెంబర్ 11 నాటికి ఈ పథకంలో 74.6 మిలియన్ల మంది చేరారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this