Home Loans: గుడ్‌న్యూస్‌.. మ‌రింత చౌక‌గా హోం...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Home Loans: గుడ్‌న్యూస్‌.. మ‌రింత చౌక‌గా హోం లోన్స్..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 సొంత ఇంటి కోసం అంతా క‌ల‌లు కంటూనే ఉంటారు.. అయితే, ఆ క‌ల సాకారం చేసుకుని శుభ‌వార్త చెబుతోంది ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ)… ఇప్ప‌టికే అతిత‌క్కువ వ‌డ్డీ రేట్ల‌ను హోం లోన్స్ అందిస్తోన్న ఎస్బీఐ.. ఇప్ప‌డు ఆ వడ్డీరేట్లను మ‌రింత తగ్గించింది. ప్రారంభ వడ్డీరేటును 6.95 శాతం నుంచి 6.7 శాతానికి త‌గ్గించిన‌ట్టు తాజాగా ప్ర‌క‌టించింది..  ఈ నిర్ణయం త‌క్ష‌ణ‌మే అమల్లోకి వస్తుందని పేర్కొంది ఎస్బీఐ.. ఇక‌, మహిళా రుణ గ్రహీతలకు అయితే, 5 బేసిస్‌ పాయింట్ల ప్రత్యేక రాయితీ కూడా ఇస్తున్న‌ట్టు వెల్ల‌డించింది. ఇక‌, వ‌డ్డీ రేట్ల త‌గ్గింపు త‌మ‌కు మ‌రింత క‌లిసి వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తోంది ఎస్బీఐ.. సరసమైన ధరల్లో లభించే గృహాల రుణాలకు కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వ‌స్తుంద‌ని ఆశిస్తున్న‌ట్టు ఎస్బీఐ రిటైల్‌, డిజిటల్‌ బ్యాంకింగ్‌ ఎండీ సీఎస్‌ శెట్టి తెలిపారు. 

ఇక‌, పూర్తిస్థాయిలో వ‌డ్డీరేట్ల‌ను ప‌రిశీలించిన‌ట్టు అయితే.. రూ.30 లక్షల వరకు గృహ రుణాలపై 6.7 శాతం వడ్డీయే ఉంటుంద‌ని ఎస్బీఐ పేర్కొంది.. అదే మహిళలైతే 6.65 శాతం వడ్డీకే రుణం పొందే ఆఫ‌ర్ తెచ్చింది… మ‌రోవైపు.. రూ.30 లక్షల నుంచి 75 లక్షల వరకుండే రుణాలపై వడ్డీరేటు 6.95 శాతంగా ఉండ‌నుండ‌గా.. రూ.75 లక్షలకుపైగా తీసుకునే రుణాలపై 7.05 శాతం వడ్డీని ఫైన‌ల్ చేసింది ఎస్బీఐ.. ఇక‌, ఎస్బీఐ క‌స్ట‌మ‌ర్లు యోనో యాప్‌ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే వడ్డీరేటుపై అదనంగా 5 బేసిస్‌ పాయింట్ల రాయితీ పొంద‌వ‌చ్చు అంటోంది ఎస్బీఐ..


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this