Daily Astrology: మే 5, బుధవారం దినఫలాలు

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Daily Astrology: మే 5, బుధవారం దినఫలాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మేషం : పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఆశాజనకం. ఉపాధ్యాయులు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆందోళన తప్పదు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. మిమ్మల్ని పొగిడేవారే కానీ, సహకరించేవారుండరు.

వృషభం : కుటుంబంలో నెలకొన్న అనిశ్చితులు, అశాంతి క్రమంగా తొలగిపోగలవు. వ్యాపారులకు పోటీ పెరగడంతో ఆశించినంత ఆర్థిక సంతృప్తి ఉండదు. సేవా, పుణ్య కార్యాల్లో మీ శ్రమకు మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

మిథునం : వ్యాపార రంగాల్లో వారికి తోటివారి వల్ల సమస్యలు తలెత్తుతాయి. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. రావలసిన ధనం చేతికందడంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. స్త్రీలు కోరుకునే మార్పులు నిదానంగా అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.

కర్కాటకం : వస్త్ర, బంగారు, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ప్రైవేటు సంస్థల్లో వారికి ఓర్పు, నేర్పుతో ఎంతో అవసరం. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి రాగలవు. ఒక వ్యవహారం నిమిత్తం కొత్త ప్రదేశానికి ప్యరాణం చేయవలసి వస్తుంది. భాగస్వాముల మధ్య పరస్పర అవగాహన అభివృద్ధి కానవస్తుంది.

సింహం : వృత్తి వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవవుండదు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. రవాణా రంగాల వారికి ప్రయాణీకులతో చికాకులు అధికమవుతాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి, ఏకాగ్రత పెంచుకుంటారు. ప్రేమికుల మధ్య అనుమానాలు, అపార్థాలు తలెత్తుతాయి.

కన్య : సంఘంలో పలుకుబడి గల వ్యక్తుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి. ప్రభుత్వ రంగంలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. కాంట్రాక్టర్లకు నూతన అవకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు.

తుల : అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి చూపుతారు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. దూర ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారులకు సంతృప్తి, పురోభిృవృద్ధి కానవస్తుంది. ఉద్యోగ విరమణ చేసిన వారికి ఆందోళన, చికాకులు తప్పవు.

వృశ్చికం : వైద్య, ఇంజనీరింగ్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు ఒత్తిడి తప్పదు. ఇతరుల మెప్పుకోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది. దూరపు బంధువుల రాక మిమ్మలను సందిగ్ధంలో పడేస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం.

ధనస్సు : చిరు వ్యాపారులకు అభివృద్ధి కానరాగలదు. దంపతుల మధ్య సఖ్యతాలోపం, చీటికి మాటికి విసుక్కోవడాలు వంటివి చోటుచేసుకుంటాయి. బంధు మిత్రులరాకతో గృహంలో కొత్త వాతావరణం, ఉత్సాహం సంతరించకుంటాయి. స్త్రీల నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది.

మకరం : ప్రయత్నపూర్వకంగానే అనుకున్న పనులు పూర్తికాగలవు. కార్మికుల కృషికి తగిన ప్రతిఫలం కానరగాలదు. పారిశ్రామిక రంగంలోని వారికి నూతన ఆలోచనలు స్ఫురించగలవు. రిప్రజెంటేటివ్‌లకు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, తిప్పట అధికమవుతాయి. పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. ప్రేమికుల మధ్య ఎడబాట్లు తప్పవు.

కుంభం : వాతావరణంలో మార్పు వల్ల పెద్దలు స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. ఒకసారి చేజారిన అవకాశం మళ్లీ రాకపోవచ్చని గమనించండి. వాహనం వీలైనంత నిదానంగా నడపడం అతి ముఖ్యం. ఖర్చులు పెరిగినా మీ ఆర్థిక స్థితి ఏమాత్రం లోటువుండదని చెప్పవచ్చు. పత్రికా సంస్థలోని వారికి మార్పులు అనుకూలించవు.

మీనం : ఇంటా బయటా మీ మాటకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగానే ఉంటాయి. స్థిరచరాస్తుల విషయలో ముఖ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. స్త్రీలకు టీవీ చానెళ్లకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి.

Daily Astrology: మే 5, బుధవారం దినఫలాలు


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this