LIC Agent Jobs: లక్షల సంఖ్యలో ఏజెంట్లను...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

LIC Agent Jobs: లక్షల సంఖ్యలో ఏజెంట్లను నియమించుకుంటోన్న ఎల్ఐసీ… మీరూ దరఖాస్తు చేయండి ఇలా..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 LIC Agent Jobs | మీరు ఎల్ఐసీ ఏజెంట్‌గా లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC సంస్థలో చేరాలనుకుంటున్నారా? ఎలా చేరాలో తెలుసుకోండి.

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC ఏజెంట్ల నియామకంలో అదే దూకుడు చూపిస్తోంది. భారీ సంఖ్యలో కొత్త ఏజెంట్లను నియమించుకుంటోంది. 2020 ఏప్రిల్ 1 నాటికి ఎల్ఐసీ ఏజెంట్ల సంఖ్య 12,08,826 కాగా 2021 ఏప్రిల్ 1 నాటికి 13,53,808 ఏజెంట్లు ఉన్నారు. అంటే ఒక్క ఏడాదిలోనే ఎల్ఐసీలో 1,44,982 ఏజెంట్లు పెరిగారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా లైఫ్ ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలకు డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బీమా రంగంలో దిగ్గజ కంపెనీ అయిన ఎల్ఐసీ… డిమాండ్‌కు తగ్గట్టుగా బిజినెస్‌ను పెంచుకునేందుకు కొత్త ఏజెంట్లను నియమించుకుంటోంది. భారీ స్థాయిలో కొత్త ఏజెంట్లను చేర్చుకుంటోంది. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీలో 3,45,469 కొత్త ఏజెంట్లు చేరారు. అంటే రోజుకు సుమారు 1000 మంది ఏజెంట్లను నియమించుకుంటోంది ఎల్ఐసీ.
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC సంస్థలో ఏజెంట్‌గా చేరడానికి కేవలం టెన్త్ పాస్ అయితే చాలు. ఇన్స్యూరెన్స్ రంగం, పర్సనల్ ఫైనాన్స్ లాంటి అంశాల్లో కాస్త అవగాహన ఉంటే ఇంకా మంచిది. టెన్త్ పాసై, 18 ఏళ్ల వయస్సు దాటినవారు ఎవరైనా ఎల్ఐసీ ఏజెంట్ కావొచ్చు. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయొచ్చు. పూర్తి వివరాలు https://www.licindia.in/ వెబ్‌సైట్‌లో ఉంటాయి. లేదా మీకు దగ్గర్లోని ఎల్ఐసీ బ్రాంచ్ ఆఫీస్‌కు వెళ్లి అక్కడ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌ని కలిసి వివరాలు తెలుసుకోవచ్చు. అక్కడే దరఖాస్తు కూడా చేయొచ్చు. దరఖాస్తు చేయడానికి మీ టెన్త్ మెమో, 6 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ లాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి. మొదట బ్రాంచ్ మేనేజర్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మీరు ఏజెంట్‌గా పనికి వస్తారో లేదో నిర్ణయిస్తారు.
మీరు ఎల్ఐసీ ఏజెంట్‌గా చేరొచ్చు అని బ్రాంచ్ మేనేజర్ భావిస్తే మిమ్మల్ని డివిజనల్ లేదా ఏజెన్సీ ట్రైనింగ్ సెంటర్‌కు పంపిస్తారు. అక్కడ లైఫ్ ఇన్స్యూరెన్స్ బిజినెస్‌కు సంబంధించి 25 గంటల శిక్షణ ఉంటుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ప్రీ-రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ రాయాలి. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI ఈ ఎగ్జామ్ నిర్వహిస్తుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత ఇన్స్యూరెన్స్ ఏజెంట్‌గా మిమ్మల్ని నియమిస్తూ అపాయింట్‌మెంట్ లెటర్, ఐడీ కార్డ్ వస్తుంది. బ్రాంచ్ ఆఫీసులో డెవలప్‌మెంట్ ఆఫీసర్ టీమ్‌లో ఏజెంట్‌గా పనిచేయాల్సి ఉంటుంది.
మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా, ఒక చోట కూర్చొని పనిచేసే ఉద్యోగం కాకుండా బయట తిరుగుతూ, నలుగురిని కలవడం ఎక్కువగా ఇష్టమైనా, రోజూ 8 గంటలో, 12 గంటలో పనిచేసే ఉద్యోగం కాకుండా ఎన్ని గంటలు పనిచేయాలో మీరే నిర్ణయించాలన్న మనస్తత్వం ఉన్నా ఎల్ఐసీ ఏజెంట్‌గా చేరొచ్చు. ఎంత కష్టపడితే అంత ఆదాయం ఉంటుంది. అనేక లాభాలు, ప్రయోజనాలు ఉంటాయి. నిరంతరం శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this