CoWin app: వ్యాక్సిన్ వేయించుకోవాలంటే.. నాలుగు అంకెల...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

CoWin app: వ్యాక్సిన్ వేయించుకోవాలంటే.. నాలుగు అంకెల కోడ్ చెప్పాల్సిందే.. ‘కోవిన్’ యాప్‌లో సరికొత్త ఫీచర్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

CoWin app security code: దేశవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ 16.5 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. కోవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికే వ్యాక్సిన్‌ను వేస్తున్నారు. అయితే.. కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించే కోవిన్ పోర్టల్‌ భద్రతపై ఎన్నో ఊహగానాలు మోదలయ్యాయి. ఈ పోర్టల్‌లో నమోదు చేసే సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశాలు ఉన్నాయని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త ఫీచర్‌ను అమల్లోకి తీసుకు వచ్చింది. దీనివల్ల డేటా ఎంట్రీ ఎర్రర్స్ కూడా కనిష్ట స్థాయికి తగ్గుతాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. కోవిన్ కొత్త ఫీచర్ మే 8 నుంచి అమల్లోకి వస్తుందంటూ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈ కొత్త ఫీచర్‌లో నాలుగు అంకెల సెక్యూరిటీ కోడ్‌ను కొత్తగా ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల డేటా ఎంట్రీ ఎర్రర్స్ కనిష్ట స్థాయికి తగ్గుతాయని.. భద్రత లోపం కూడా ఉండదని, ప్రజలకు కలిగే అసౌకర్యం తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

అంతకుముందు కొందరు చేసిన ఆరోపణల ప్రకారం.. కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు నిర్దేశిత తేదీ నాడు వ్యాక్సినేషన్ కోసం వెళ్లకపోయినా.. వారికి వ్యాక్సినేషన్ జరిగినట్లు ఎస్ఎంఎస్ వచ్చేది. దీంతోపాటు భద్రతాపరమైన వివరాలకు కూడా విఘాతం కలుగదని ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. ఇకపై వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హతగల వ్యక్తికి వ్యాక్సిన్ డోసును ఇవ్వడానికి ముందు వెరిఫయర్/వ్యాక్సినేటర్ ఆ వ్యక్తిని నాలుగు అంకెల కోడ్‌ చెప్పాలని సూచించింది. ఆ కోడ్‌ను కోవిన్ సిస్టమ్‌లో ఎంటర్ చేస్తారని తెలిపింది. దీంతో వ్యాక్సినేషన్ స్టేటస్ సరైన విధంగా రికార్డ్ అవుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే.. వ్యాక్సినేషన్ కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నవారికి మాత్రమే ఈ నాలుగు అంకెల కోడ్ వస్తుంది. అపాయింట్‌మెంట్ అక్‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్ మీద కూడా ఈ కోడ్ ఉంటుంది. లబ్ధిదారునికి అపాయింట్‌మెంట్ ఖరారు అయిన తర్వాత వచ్చే ఎస్ఎంఎస్‌లో కూడా ఈ నాలుగు అంకెల కోడ్ ఉంటుంది. వారు దీనిని చెప్పి వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this