Friday, August 29, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Daily Astrology: మే 8, శనివారం దిన...

AP DSC 2025 Call Letter Download, AP DSC Hall Ticket, APDSC Certificate Verification, Mega DSC 2025 Call Letter, APDSC Login

సర్టిఫికెట్ verificationకి హాజరవ్వడానికి ముందు AP DSC 2025 Call Letter...

ఆంధ్రప్రదేశ్ Mega DSC 2025 Latest Press Note: మెరిట్ జాబితా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వివరాలు ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ Mega DSC 2025 కోసం అన్ని...

DSC Certificate Verification Process 2025 From 28.08.2025 : DSC Call Letter Download from Login

డిజిటల్ సెర్టిఫికేట్ (DSC Certificate) అభ్యర్ధులకు ధృవీకరణ (DSC Certificate Verification)...

Daily Astrology: మే 8, శనివారం దిన ఫలాలు – నమ్మించి మోసే చేసే వారితో జాగ్రత్త

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Horoscope today 8-5-2021: వీకెండ్ వచ్చింది. మరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్లకు సంబంధించి నేటి రాశిఫలాలు ఏం చెబుతున్నాయో చూద్దాం.

Horoscope 8-5-2021: రాశి ఫలాలు తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. చాలా మంది తమకు తోచినవి చెప్పేసి… అవే రాశి ఫలాలు అనేస్తారు. కానీ కొందరు పండితులు అలా కాదు. కాచి వడబోసి రాశిఫలాలను చెబుతారు. ముఖ్యంగా తిథి, నక్షత్రం, గ్రహ బలాలు, రాశుల నక్షత్రాలు, కాలం, సూర్యగమనం ఇవన్నీ లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ఏది వదిలేసి చెప్పినా అది నిజమైన రాశి ఫలం అనిపించుకోంది. న్యూస్18 పండితులు ఈ విషయంలో అత్యంత జాగ్రత్త వహిస్తూ రాశిఫలాలు, వారఫలాలు ఇస్తున్నారు. మరి ఈ శనివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో, ఏ రాశుల వారికి ఏ శుభవార్తలు ఉన్నాయో తెలుసుకుందాం.
మేష రాశి (Aries) ఆర్థిక స్థితి క్రమంగా మెరుగవుతుంది. వృత్తిలో బాగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి.
వృషభ రాశి (Taurus) ఒక ముఖ్యమైన కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం చేకూరుతుంది. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. అన్నింటా సానుకూల వాతావరణం నెలకొని ఉంది. వ్యాపారంలో మాత్రం కాస్త జాగ్రత్త అవసరం. పెళ్లి సంబంధం ఖాయమవుతుంది.
మిథున రాశి (Gemini) ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త వింటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వపరంగా మేలు జరుగుతుంది. ముఖ్యమైన పనులు జాగ్రత్తగా పూర్తి చేస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయాలు అనుభవానికి వస్తాయి.
కర్కాటక రాశి (Cancer) ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. ఓ కుటుంబ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం పరవా లేదు.
సింహ రాశి (Leo) ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. బంధుమిత్రుల సహాయంతో ఓ వ్యక్తిగత సమస్యను పరిష్కరించుకుంటారు. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తారు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.
కన్య రాశి (Virgo) ఆర్థిక స్థితి బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో సమర్థవంతంగా పని చేస్తారు. అవసరాలకు ధనం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నమ్మించి మోసగించే వారితో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.
తుల రాశి (Libra) ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. సొంత నిర్ణయాల వల్ల మేలు జరుగుతుంది. కుటుంబపరంగా సమస్యలు ఉన్నా ధైర్యంగా ఎదుర్కొంటారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ప్రారంభించిన పనుల్లో పురోగతి ఉంటుంది.
వృశ్చిక రాశి (Scorpio) ఉద్యోగ, వివాహ పరంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. దగ్గరి బంధువుతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారపరంగా శ్రమ ఎక్కువవుతుంది. పలుకుబడి పెరుగుతుంది. హామీలు ఉండొద్దు.
ధనస్సు రాశి (Sagittarius) పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారంలో, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఇంటి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
మకర రాశి (Capricorn) తలచిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంటా బయటా శుభమే జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వివాదాలకు ఇది సమయం కాదు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంది.
కుంభ రాశి (Aquarius) ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ పెంచాలి. అనుకూలమైన సమయం ఇది. అవరోధాలు, ఆటంకాలు తొలగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం కాపాడుకోవాలి. పని ఒత్తిడి ఉంటుంది. చెడు ఆలోచనలను దగ్గరకి రానివ్వవద్దు.
మీన రాశి (Pisces) ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. సుఖసంతోషాతో గడుపుతారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెంచాలి. పరువు ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగరీత్యా కొన్ని మంచి వార్తలు వింటారు. వ్యాపారాలు లాభాలతో నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి.

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this