Schools Reopening: పాఠశాలల పునఃప్రారంభంపై పరిశీలన

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Schools Reopening: పాఠశాలల పునఃప్రారంభంపై పరిశీలన

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • అనుకూల వాతావరణం వస్తే 10వ తరగతి పరీక్షలు
  • స్కూల్ కాంప్లెక్స్లుకు జగనన్న విద్యా కానుక కిట్లు
  • పాఠశాలల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు

మచిలీపట్నం టౌన్, మే 11:* కరోనా సెకండ్ వేవ్ తగ్గు ముఖం పట్టిన తరువాత జూలై 1 నుంచి పాఠశాలల పునఃప్రారం బానికి యోచిస్తున్నామని పాఠశా లల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు అన్నారు. మంగళ వారం ఆర్జేడీ నరసింహారావుతో కలసి మచిలీపట్నం పాతరామన్నపేట మునిసిపల్ స్కూల్, రాంజీ ప్రభుత్వం హైస్కూల్ను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలల్లో నాడు- నేడు కింద జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యేనాటికి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు పుస్తకాలు, బూట్లు, టైలు, యూనిఫాం ఇచ్చే కార్యక్రమం ముమ్మరంగా కొన సాగుతోందన్నారు. స్కూల్ కాంప్లెక్స్లకు జగ’నన్న విద్యాకానుక కిట్లు ఇప్పటికే చేరాయన్నారు. విద్యాసంవత్సరంలో విద్యా కార్యక్రమాలు సంతృప్తికరంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. నాడు నేడు కార్యక్ర మాల అమలువల్ల పాఠశాలలకు భౌతిక వనరులు ఏర్పడ్డాయన్నారు. 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. అయితే కొవిడ్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు జరుపుతామన్నారు. ఇప్పటికే పశ్చిమగోదావరి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పర్యటించామన్నారు. కృష్ణాజిల్లాలో నిర్వహిస్తున్న నాడు- నేడు కార్య క్రమాల అమలును జిల్లా విద్యాశాఖాధికారి తహెరా సుల్తానా, ఇతర అధికా రులతో చర్చించామన్నారు. కొవిడ్ వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ విద్యాశాఖాధికారులు పరిపాలనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం డీఈవో కార్యాలయంలో చినవీరభద్రుడుకు డీఈవో తాహెరా సుల్తానా, సూపరింటెండెంట్లు పూలదండలతో స్వాగతం పలికారు. డీఈవో కార్యాలయంలో ఫైళ్ల పెండింగ్పై అధికారులు, సూపరింటెండెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this