AP Corona Cases: ఏపీలో కొత్త‌గా 22,517...

AP Inter Results 2026 Today Live: Direct Links for 1st & 2nd Year Results, WhatsApp Mana Mitra Process, SMS Method

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

AP Corona Cases: ఏపీలో కొత్త‌గా 22,517 క‌రోనా పాజిటివ్ కేసులు.. ప్ర‌మాద‌క‌రంగా మ‌ర‌ణాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Corona in AP: ఏపీలో క‌రోనా తీవ్రత కొన‌సాగుతుంది. కొత్త‌గా 89,535 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 22,517 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ రాష్ట్రంలో 14,11,320 మంది వైరస్‌ బారినపడ్డారు. కరోనా కార‌ణంగా కొత్త‌గా.. అనంతపురంలో 12 మంది చ‌నిపోగా, నెల్లూరులో 11, తూర్పుగోదావరి 10, విశాఖ 9, విజయనగరం 9, చిత్తూరు 8, శ్రీకాకుళం 8, గుంటూరు 7, పశ్చిమగోదావరి 7, కృష్ణా 5, కర్నూలు 5, ప్రకాశం 5, కడప ఇద్దరు ప్రాణాలు విడిచారు. తాజాగా 18,739 మంది వైర‌స్ బారి నుంచి కోలుకోగా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 11,94,582 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో తూర్పుగోదావరిలో అత్య‌ధికంగా 3383 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, అత్యల్పంగా విజయనగరంలో 992 కేసులు వెలుగుచూశాయి. మొత్తం 1,78,80,755 శాంపిల్స్ ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ ఆరోగ్య శాఖ పరీక్షించింది.

#COVIDUpdates: 15/05/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 14,08,425 పాజిటివ్ కేసు లకు గాను
*11,91,687 మంది డిశ్చార్జ్ కాగా
*9,271 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,07,467#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/DAQwO7iDLW

— ArogyaAndhra (@ArogyaAndhra) May 15, 2021

కాగా క‌రోనా కొత్త వేరియంట్లపై ఎన్నో అనుమానాలు నెల‌కుంటున్నాయి. వీటిని వ్యాక్సిన్లు ఏమేర ఎదుర్కొంటాయన్న దానిపై ఇంకా క్లారిటీ రావ‌డం లేదు. తాజాగా ఢిల్లీలోని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా కీలక సూచన చేశారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ.. మాస్కులు ధరించాల్సిందేనని సూచించారు. అలాగే భౌతిక దూరం సైతం పాటించాలన్నారు. వైరస్‌ రోజురోజుకీ కొత్తరూపు సంతరించుకుంటున్న నేపథ్యంలో అలెర్ట్ గా ఉండాల‌న్నారు. కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్ల సామర్థ్యం ఎంత అన్నది ఇంకా స్ప‌ష్ట‌త రాలేద‌ని చెప్పారు. అయితే, ఏ వేరియంట్‌ బారి నుంచైనా మాస్కు, భౌతిక దూరం రక్షిస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని సూచించారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this