Andhrapradesh: కొన్ని నెలలుగా ఆ టీచర్‌ స్కూల్‌కు...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Andhrapradesh: కొన్ని నెలలుగా ఆ టీచర్‌ స్కూల్‌కు వెళ్లలేదు.. అధికారుల మెమో, ఇంత‌లోనే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Anganwadi Teacher Suicide: చిన్న, చిన్న కార‌ణాల‌తో క్ష‌ణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు కొంద‌రు. తాజాగా ఓ అంగన్‌వాడీ టీచర్‌ అధికారులు మెమో ఇచ్చారని త‌నువు చాలించింది.

చిన్న, చిన్న కార‌ణాల‌తో క్ష‌ణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు కొంద‌రు. తాజాగా ఓ అంగన్‌వాడీ టీచర్‌ అధికారులు మెమో ఇచ్చారని త‌నువు చాలించింది. గుంటూరు నగరంలోని అరండల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జ‌రిగింది. స్థానిక‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా వినుకొండ మండలం జద్దవారిపాలెంకు చెందిన మేరి కుమారి (40) అంగన్‌వాడీ టీచర్‌గా వ‌ర్క్ చేస్తుంది. ఆమె భర్త లింగారావు చర్చిలో మ‌త బోధ‌కుడిగా పని చేస్తున్నారు. లింగారావు మొదటి భార్య చ‌నిపోవ‌డంతో.. మేరి కుమారిని ఆయన సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. మేరి కుమారికి చిన్నతనం నుంచి మూర్ఛ వ్యాధి ఉంది. ఈ క్ర‌మంలో గత కొన్ని నెలలుగా.. వివిధ కార‌ణాల వ‌ల్ల‌ ఆమె విధులకు వెళ్లలేదు. దీంతో అధికారులు ఆమెకు మెమో ఇష్యూ చేశారు. దీని వల్ల ఆమె మ‌న‌స్తాపానికి గురయ్యారు.
ఈ క్ర‌మంలో మేరి కుమారి గుంటూరులోని భారత్‌పేటలో నివాసం ఉంటన్న సోద‌రి లోకేశ్వరి వద్దకు 10 రోజుల క్రితం వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆమె సూసైడ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని బంధువులు భర్తకు తెలియజేయగా.. ఆయన పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this