Monday, February 23, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
WhatsApp Privacy Policy: వాట్సాప్‌ ప్రైవసీ పాలసీకి...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

WhatsApp Privacy Policy: వాట్సాప్‌ ప్రైవసీ పాలసీకి ‘ఎస్‌’ కొట్టేశారా? అయితే, ఇప్పుడు ఏమవుతుందో తెలుసా..?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

WhatsApp Privacy Policy: వాట్సాప్ లో కొత్త ప్రైవసీ నిబంధనలు అమలులోకి వచ్చాయి. అయితే ఈ నిబంధనలను అంగీకరిస్తే ఏమంతుందోన్న సందేహం అందిరిలో వ్యక్తమవుతుంది. వారి కోసం ఈ వివరాలు..

వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీ గురించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. కొత్త పాలసీని అంగీకరిస్తే వ్యక్తిగత సమాచారం ఫేస్‌బుక్‌, దాని అనుబంధ సంస్థలకు వెళ్తుంది అంటూ చర్చ కొనసాగుతూనే ఉంది. ఆఖరికి ఆ విషయం ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కింది. అయితే ఈ విషయంలో పట్టుదిగని వాట్సాప్‌, ఈ నెల 15 నుంచి కొత్త ప్రైవసీ పాలసీని అమలులోకి తెచ్చినట్లు ప్రకటించింది. కొత్త నియమ నిబంధనలను అంగీకరించకపోతే, యూజర్ల వాట్సాప్‌ సేవలు నిలిపేస్తాం అని సంస్థ చెబుతోంది. ఒక్కసారి ప్రైవసీ పాలసీకి యాక్సెప్ట్‌ కొడితే… మళ్లీ వినియోగదారులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం కుదరదు. అయితే ఈ నియమాలకు ఓకే చెప్తే ఏమవుతుందనే ప్రశ్న వేస్తున్నారు కొందరు నెటిజన్లు. ఈ నేపథ్యంలో అసలు కొత్త నిబంధనలు యూజర్లు ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం. ప్రైవసీ పాలసీలో చేసిన మార్పులు బిజినెస్‌ ఫీచర్ల కోసమే అని వాట్సాప్‌ చెబుతోంది. యూజర్లకు సంబంధించిన డేటా విషయంలో భవిష్యత్తులో ఎలాంటి ఆలోచనలు చేస్తుందనేది ఆ పాలసీలో పొందుపరిచారు. సాధారణంగా బిజినెస్‌ అకౌంట్లలో రెండు రకాలు ఉంటాయి.
ఒకటి క్లౌడ్‌ ప్రొవైడర్స్‌ అయితే, రెండోది సాధారణ అకౌంట్‌. ఈ సమయంలో కొత్త ప్రైవసీ పాలసీ తొలి అకౌంట్‌కే వర్తిస్తుంది. రెండో అకౌంట్‌లో ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ కొనసాగుతుంది. అంటే రెండో రకం బిజినెస్‌ అకౌంట్‌తో సంభాషణ జరపడం అంటే సాధారణ వాట్సాప్‌ ఖాతాతో సంభాషించినట్లే ఉంటుంది. మొదటి రకం బిజినెస్‌ ఖాతాతో సంభాషించినప్పుడు (ఛాట్‌ చేసినప్పుడు) వాటి ప్రకారం యాడ్స్‌ ఆ మొబైల్లో వస్తాయి. అయితే ఇలాంటి ఖాతాలకు ప్రత్యేకమైన గుర్తు (బ్యాడ్జ్‌) ఇస్తారు. కాబట్టి ఆ తరహా బిజినెస్‌ అకౌంట్‌ ఉన్నవాళ్లతో ఛాట్‌ చేయాలా వద్దా అనేది యూజర్ల ఇష్టం.
అంతేకాదు వాట్సాప్‌ బిజినెస్‌ అకౌంట్‌తోపాటు, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌కు సంబంధించిన క్లౌడ్‌ప్రొవైడర్స్‌ ఆప్షన్‌ ఎనేబుల్‌ ఉన్నవాళ్లతో బిజినెస్‌ అకౌంట్స్‌తో ముచ్చటించినా ఆ డేటాను ఫేస్‌బుక్‌ సంగ్రహిస్తుంది. దానికి తగ్గట్టుగా యూజర్లకు యాడ్స్‌ వచ్చేలా తమ యాడ్‌ నెట్‌వర్క్స్‌కు అందిస్తుంది. అయితే ఈ విషయాన్ని కూడా వాట్సాప్‌ వినియోగదారులకు తెలియజేస్తుంది. ఇదన్నమాట వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్‌ చేస్తే జరిగేది.
మొన్నీమధ్య ఢిల్లీ హైకోర్టులో జరిగిన కేసు వాదనల్లో వాట్సాప్‌ తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ మాట్లాడుతూ… ‘కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించని… వాట్సాప్‌ ఎలాంటి వాట్సాప్‌ ఖాతాలను డిలీట్‌ చేయలేదు. వినియోగదారులు ఒప్పుకునేంతవరకు కొత్త పాలసీని అంగీకరించమని అడుగుతాం. ఆ తర్వాత మెల్లగా అంగీకరించని వారి ఖతాలు డిలీట్‌ చేస్తాం’ అని చెప్పారు. అంటే ఎప్పుడో ఒకప్పుడు యూజర్లు కొత్త నియమ నిబంధనలను అంగీకరిస్తేనే, వాట్సాప్ సేవలు పొందే వీలుంటుంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this