Krishnapatnam Ayurvedam Full Report in Telugu:...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Krishnapatnam Ayurvedam Full Report in Telugu: క్రిష్ణ పట్నం ఆయుర్వేదం రిపొర్టు పూర్తి తెలుగు పాఠం..5 రకాల మందులు, తయారీ పధ్ధతులు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 జిల్లా పంచాయతి అధికారి వారి కార్యాలయం,

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,

తేది : 17-05- 2021.

విచారణ నివేదిక

శ్రీయుత జిల్లా కలెక్టర్‌, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వారి ఆదేశముల మేరకు ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామం నందు కోవిడ్‌ 19 నకు ఆయుర్వేద చికిత్స పై జిల్లా పంచాయతి అధికారి వారు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి వారు, రెవిన్యూ డివిజనల్‌ అధికారి, నెల్లూరు వారు, ఆయుర్వేద డాక్టర్లు మరియు స్థానిక మండల పరిషత్‌ అబివృద్ది అధికారి & తహసిల్దార్‌ వారితో విచారణ జరిపి సమర్పించు నివేదిక :

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామం నందు శ్రీ బొరిగి ఆనందయ్య అనువారు కోవిడ్‌ 19 నకు ఆయుర్వేద చికిత్స చేయుచున్నారు. అతను, గొలగమూడి వెంకయ్య స్వామి వారి శిష్యులైన శ్రీ గురవయ్య స్వామి మరియు చెన్నై పట్టణం రెడ్‌ హిల్స్‌ ప్రాంతమునకు చెందిన వివేకానంద అను సిద్ద వైద్యుల వద్ద ఆయుర్వేద చికిత్స నేర్చుకొన్ననని తెలిపియున్నారు. ఇతను గతములో సర్పంచ్‌ గా మరియు ఎం.పీ.టి.సి గా పనిచేసియున్నానని తెలిపియున్నారు. తను ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా ఈ మందు రోగులకు అందిస్తున్నని తెలిపినారు.

లోకాయుక్తకు సమర్పించిన పూర్తి అధికారిక రిపోర్టు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

తాను, గత నెల శ్రీరామ నవమి నుండి అనగా 21-4-2021 నుండి కోవిడ్‌ 19 నకు చికిత్స చేయుచున్నననియు, మొదట పదులలో పేషంట్లు వచ్చేవారనియు తదుపరి ఆ సంఖ్య వందలకు పెరిగి ప్రస్తుతము రోజుకు 4 వేల నుండి 5 వేల మంది వరకు తాను ఇచ్చు ఆయుర్వేద మందు కొరకు వచ్చుచున్నారని నదని తెలిపినారు.

సదరు శ్రీ బొరిగి ఆనందయ్యను తాను కోవిడ్‌ 19 నకు తయారుచేయు మందుల యొక్క వివరములు తెలుపమని కోరగా వారు ఈ క్రింది విధముగా తెలిపియున్నారు.

అతను, కరోన నివారణ నిమిత్తం 5 (అయిదు) రకములైన మందులు తయారుచేసి పేషంట్లకు ఇచ్చుచున్నానని తెలిపి వాటిని తయారు చేయు విధానము ఈ క్రింద విధముగా తెలిపియున్నారు.

  • మందుపేరు.
  • వాడు పదార్థములు.
  • కావలసిన మొత్తం.
  • తయారుచేయు విధానము
  • ఉపయోగించు విధానము.
  • పత్యము.

మొదటి రకము: 1P – ఊపిరితిత్తులు శుభ్రం చేయును కరోనా పాజిటివ్ ఉన్న వారికి, లేని వారికి

రెండవ రకము: 2F – కరోనా పాజిటివ్ ఉన్న వారికి

మూడవ రకము: 3L – కరోనా పాజిటివ్ ఉన్న వారికి

నాల్గవ రకము: 4K – కరోనా పాజిటివ్ ఉన్న వారికి

ఐదవ రకము: 5I – ఆక్సిజన్ తగ్గిన వారికి, కంటి డ్రాప్స్

ఆయుర్వేద డాక్టర్ల నివేదిక

తదుపరి స్టానికంగా హాజరైన ప్రజలతో మాట్లాడుట జరిగినది, హాజరైన ప్రతి ఒక్కరు సదరు ఆయుర్వేద మందు పట్ల పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేసినారు. ఎవ్వరును సదరు మందు వలన ఎటువంటి చెడుప్రభావములకు లోనుకాలేదని తెలిపియున్నారు.
స్థానిక పత్రికా విలేఖరులు మరియు ACN ఛానల్‌ వారు కూడా తాము ప్రతి నిత్యము ఆ ప్రాంతమును సందర్శ్భించుచున్నామనియు, ఇక్కడకు వచ్చు రోగులు ఈ ఆయుర్వేద మందు తిన్న తరునాత స్వస్థత చేకూరి వారి వారి ప్రాంతములకు సంతోషముగా తిరిగి వెళుతున్నరనియు, ఒక్కరు కూడా తమకు అనారోగ్యము తగ్గనట్లుగా చెప్పలేదని తెలిపియున్నారు.

కావున, పై విచారణ తరువాత తమరికి సమర్చించుకోనునది ఏమనగా

సదరు ఆయుర్వేద చికిత్స కొరకు అవలంబించుచున్న ప్రక్రియ శాస్త్రీయంగా నిరూపితం కావలసియున్నది మరియు చికిత్స తరువాత వచ్చు పరిణామాలపై పరీక్షలు జరగవలసియున్నది. కానీ నేటి వరకు సదరు చికిత్సపై ఎటువంటి వ్యతిరేక పిర్యాదులు గాని చికిత్స తరువాత తాము అనారోగ్యమునకు గురిఅయి ఉన్నామనిగాని ఎవ్వరును తెలిపియుండలేదు. మరియు అక్కడకు హాజరైన వారిలో ఒక పేషంట్‌ కు ఆక్సిజన్‌ లెవెల్స్‌ 83 ఉండగా అతనికి కంటిలో డ్రాప్స్‌ చేసిన గంట తరువాత అతని ఆక్సిజన్‌ లెవెల్స్‌ 95నకు పెరిగినవి. సదరు పేషంట్‌ తో మేము స్వయంగా మాట్లాడటం జరిగినది.
కానీ, సదరు చికిత్స అందించు ప్రదేశము నందు ఎటువంటి కోవిడ్‌ నిబంధనలు పాటించుటలేదు. కావున, సదరు చికిత్స పై ఏదైనా నిర్ణయము తీసుకొను వరకు అచ్చట కోవిడ్‌ నిబంధనలు అమలు చేయునట్లుగా స్థానిక అధికారులను ఆదేశించవలసియున్నది.

విచారణ నివేదిక తగు చర్య నిమిత్తము సమర్పితము.

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this