Weight Loss: వెల్లుల్లి, తేనె కలిపి తీసుకుంటే...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Weight Loss: వెల్లుల్లి, తేనె కలిపి తీసుకుంటే బరువు తగ్గడం ఖాయం.. వీటితో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Weigh Loss Garlic Honey: మనం వంటలలో ఉపయోగించే ఎన్నో పదార్థాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వెల్లుల్లి. 

దీనిలో ఔషద గుణాలు ఎన్నో ఉన్నాయి. ఇక వెల్లుల్లి, తేనె కలిపి తీసుకోవడం వలన జలుపు, దగ్గు, మంట, అధిక రక్తపోటు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా.. బరువు తగ్గడంలోనూ వీటి పాత్ర అధికంగానే ఉంటుంది.

వెల్లుల్లి, తేనె కలిపి తీసుకోవడం వలన క్రమంగా బరువు తగ్గుతారు. ఇది శరీరంలోని కొవ్వును బర్న్ చేస్తుంది. వెల్లుల్లిలో విటమిన్ బి 6, సి, ఫైబర్, మాంగనీస్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇటీవల కొన్ని ఎలుకల పై నిర్వహించిన ప్రయోగంలో వెల్లుల్లిని ఎనిమిది వారాల పాటు వాటి శరీరంలో ఉండడం వలన బాడీలో ఉన్న కొవ్వును తగిస్తుందని.. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుందని.. శరీరంలో ఉన్న ఇతర విష పదార్థాలను తొలగిస్తుందని కనుగొన్నారు. అలాగే తేనె.. శరీరంలో గ్లూకోజ్ పెంచడానికి సహయపడుతుంది. గ్లూకోజ్ మెదడులోని షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంచడంతోపాటు, కొవ్వును బర్న్ చేసే హార్మో్న్లు విడుదల చేస్తుంది. అలాగే శోథ నిరోధక లక్షణాల మంటను తగ్గిస్తుంది. దీంతో ఫ్రీరాడికల్స్ వలన వచ్చే వ్యాధులను నివారిస్తుంది.

వెల్లుల్లి పొట్టు తీసి.. ఒక చిన్న కప్పులో టీస్పూ తేనె తీసుకొని పేస్ట్ గా చేసుకోవాలి. అలా దాదాపు 15 నుంచి 20 నిమిషాలు వదిలెయ్యాలి. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తినాలి. దీనిని ఫ్రిజ్‏లో మూడు రోజులపాటు నిల్వ చేసుకోవచ్చు. మీ మిశ్రమాన్ని రోజుకు ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి. రెండు వెల్లుల్లి పాయల కంటే ఎక్కువగా తీసుకోకుడదు. ఎక్కువగా తీసుకుంటే.. నోటిలో లేదా కడుపులో మంట, గుండెల్లో మంట, గ్యాస్, వికారం, వాంతులు, శరీర వాసన, విరేచనాలు ఏర్పడతాయి. మీరు గర్భవతిగా ఉంటే, తల్లి పాలివ్వడం లేదా రక్తం సన్నబడటానికి మందులు తీసుకుంటే, తేనె, వెల్లుల్లిని తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this