Pre Primary Schools: ప్రీ ప్రైమరీ...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Pre Primary Schools: ప్రీ ప్రైమరీ పాఠశాలలు దగ్గరగా ఉండాలి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • సమీక్షలో సిఎం జగన్

ప్రీ ప్రైమరీ పాఠశాలలు పిల్లలకు చాలా దగ్గరగాఅందుబాటులో ఉండాలని, ఆ విధంగా మ్యాపింగ్ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ విద్యపై సిఎం తన క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఫౌండేషనల్ పాఠశాలలు కిలోమీటర్ దూరంలోపు ఉండాలని, హైస్కూళ్లు మూడు కిలోమీటర్ల లోపు ఉండాలని చెప్పారు. టీచర్లలోని బోధనా సామర్ధ్యాన్ని మరింత వినియోగించుకునేలా తగిన హేతుబద్ధీకరణ చేపట్టాలని తెలిపారు. కొత్త ప్రతిపాదనల అమలు వల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతుందో. పూర్తిస్థాయిలో అధికారులు ఆలోచనలు చేసి, తదుపరి సమీక్షలో నివేదించాలని ఆదేశించారు. ఒకవేళ వాటిని అమలు చేయాల్సొస్తే ముందుగా 3, 4, 5 తరగతులను యుపి స్కూళ్లకు, హైస్కూళ్లకు బదిలీ చేయాల్సి ఉంటుందన్నారు. ఇవన్నీ ఖరారైన తరువాత ఫౌండేషనల్ స్కూళ్లలో చేపట్టాల్సిన నాడు నేడు కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని తెలిపారు. స్థానిక ప్రాధకమిక పాఠశాలల్లో అంగన్వాడీలు (పిపి-1, పిపి-2) 1, 2తరగతులు ఫౌండేషనల్ స్కూళ్ల ఏర్పాటు తరువాత డిజిటల్ బోధన ప్రక్రియ (డిజిటల్ టీచింగ్)పై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ప్రతి మండలంలోనూ జూనియర్ కళాశాలలు ఒకటా, రెండు ఏర్పాటు చేయాలా… అన్న దానిపై పూర్తిస్థాయి పరిశీలన చేసి తుది నిర్ణయం తీసుకుందామన్నారు. ఈ నిర్ణయం వల్ల 11, 12 తరగతులకు ప్రభుత్వ రంగంలోనే మంచి విద్య అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్, అర్బన్ క్లినిక్కు బదలాయించాలని తెలిపారు. సుశిక్షితులైన ఆరోగ్య సిబ్బంది ఉన్నందు వల్ల వీరికి మంచి సేవలు అందే అవకాశం ఉంటుందన్నారు. ఫౌండేషనల్ స్కూళ్ల ఏర్పాటు వల్ల అధ్యాపక స్రవంతిలోకి అంగన్వాడీ టీచర్లను తీసుకురావాలని అధికారులు సిఎంకు ప్రతిపాదించారు. ప్రమోషన్ల ద్వారా ప్రైమరీ స్కూళ్లలో ఎస్ జిటిలుగా అవకాశం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ, మహిళా క్షేమశాఖ మంత్రులు ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, ముఖ్య కార్యదర్శులు బి. రాజశేఖర్, ఎఆర్ అనురాధ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ గిరిజా శంకర్, పాఠశాల విద్య, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్లు వి.చినవీరభద్రుడు, కృతికా శుక్లా తదితరులు పాల్గొన్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this