Horoscope Today: మే 28 రాశి ఫలాలు.....

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Horoscope Today: మే 28 రాశి ఫలాలు.. వీరికి విదేశీ సంస్థ నుంచి ఉద్యోగ ఆఫర్ వస్తుంది

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Horoscope today: మే 28, 2021 రాశి ఫలాలు. ఇవాళ పలు రాశుల వారికి అంతగా బాగా లేదు. ప్రతి పనీ ఆలస్యం అవుతుంది. మరికొందరికి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతంది. మరి 12 రాశుల్లో ఎవరికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడిగల వారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలో ఉన్నవారికి అభివృద్ధి కనిపిస్తోంది. సహచరులు, సన్నిహితులతో వాదనలకు దిగవద్దు.. డబ్బు జాగ్రత్త.
వృషభం (కృత్తిక 2,3,4 రోహిణి, మృగశిర 1, 2)
ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. తలచిన పనులు నెరవేరుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులు శ్రమ పడాల్సి ఉంటుంది.
మిధునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయానికి లోటుండదు. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. బంధువుల నుంచి సహాయం అందుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పంతానం నుంచి శుభ వార్తలు వింటారు. వ్యాపారులు లాభార్జన చేస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష
ఉద్యోగంలో అభివృద్ధికి అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీర్చేందుకు ప్రయత్నిస్తారు. వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. బంధవుల నుంచి ఒత్తిడి ఉంటుంది. కొత్తవారు పరిచయమవుతారు. వ్యాపారులు బాగా కష్టపడాల్సి వస్తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర)
ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారులకు బాగుంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. తిప్పట ఎక్కువగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండండి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 12
కొత్త ఉద్యోగానికి సంబంధించి అనుకుల సమాచారం అందుతుంది. ప్రతి పనీ ఆలస్యం అవుతుంది. తిప్పట ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా పరవాలేదు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఊహించని సంఘటనలు జరుగుతాయి. సమయం బాగుంది. ఆరోగ్యం జాగ్రత్త. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా పురోగతికి అవకాశం ఉంది. పెళ్లి సంబంధం కుదరవచ్చు. స్నేహితులతో పేచీలు రావచ్చు. వ్యాపారులకు అనుకూలంగా ఉంది. ఐటి వారికి బాగుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ఆదాయానికి కొరత లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. బంధువులు సంప్రతించే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు, వ్యాపారులకు అభివృద్ధి కనిపిస్తోంది. ఆరోగ్యం జాగ్రత్త. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు.
ధనుస్సు (మూల, పూర్వాషాడ, ఉత్తరాషాఢ 1)
తలచిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. సమయం బాగుంది. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. బంధువులు, స్నేహితులు సహాయపడతారు. ఆర్థిక లావాదేవీల్లో మోసపోయే ప్రమాదం ఉంది. వ్యాపారుల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1, 2)
అనుకోకుండా చేతికి డబ్బు అందుతుంది. బంధుమిత్రులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగం విషయంలో ఆందోళన చెందుతారు. డబ్బు అప్పుగా ఇవ్వాదు. తీసుకోవద్దు. లార్యాపిల్లలతో సరదాగా గడుపుతారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. వ్యాపారులు తమ వ్యూహాలు మార్చుకోవాల్సి ఉంటుంది.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3)
ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంది. స్వయం ఉపాధి వారికి సమయం అనుకూలంగా ఉంది. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఒక విదేశీ సంస్థ నుంచి మంచి ఆఫర్ వస్తుంది. భార్యాపిల్లలతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వాదనలకు దిగవద్దు. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this