DRDO 2-DG: కరోనా కోసం డీఆర్‌డీఓ అభివృద్ధి...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

DRDO 2-DG: కరోనా కోసం డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన 2-డీజీ ఔషధం ధర ఖరారు.. ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 DRDO 2-DG: కోవిడ్‌ బాధితుల చికిత్స కోసం భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసిన 2-డీజీ ఔషధం ధర ఖరారు చేసింది కేంద్ర ప్రభుత్వం. పొడి రూపంలో లభించే ఈ ఔషధం ఒక్కో సాకెట్‌ ధర రూ. 990గా డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆస్పత్రులకు మాత్రం ఫార్మా కంపెనీ డిస్కౌంట్‌ ధరకు అందించనున్నట్లు తెలిపింది. అయితే ఆ డిస్కౌంట్‌ ఎంత అన్నది ఇంకా స్పష్టత రాలేదు. 2-డీజీ మందును హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌తో కలిసి డీఆర్‌డీవో ఆధ్వర్యంలో ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌’ (ఇన్‌మాస్‌) అభివృద్ధి చేసింది. ఆక్సిజన్‌ అవసరమైన కొవిడ్‌ బాధితులు త్వరగా కోలుకునేలా ఈ ఔషధం ఎంతగానో పని చేస్తున్నట్లు డీఆర్‌డీఓ ప్రకటించింది. నీటిలో కలుపుకొని తాగేలా పౌడర్‌ రూపంలో ఉండే ఈ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీజీసీఐ) ఇటీవల అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఈ నెల 17న మొదటి విడత కింద 10వేల సాచెట్లను, మే 27న రెండో విడత కింద మరో 10వేల సాచెట్లను రెడ్డీస్‌ ల్యాబ్స్‌ మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ ఔషధాన్ని జూన్‌ మధ్యలో వాణిజ్యపరంగా ప్రారంభించనున్నట్లు తెలిపింది.

ఏడాది పాటు శ్రమించి ఔషధం తయారు..

కాగా, కరోనా కట్టడికి ఏడాది పాటు శ్రమించి ఔషధాన్ని తయారు చేశారు. గతంలో దీన్ని క్యాన్సర్‌ కోసం తయారు చేశారు. అయితే శరీరంలో క్యాన్సర్‌ కణాలకు గ్లూకోజ్‌ అందకుండా ఈ మందు అడ్డుకుంటుందని అప్పట్లో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదే సూత్రాన్ని కొవిడ్‌కు అన్వయించుకుని పరిశోధనలు ప్రారంభించారు. శరీరంలోకి ప్రవేశించిన కరోనా వైరస్‌ కణాలకు గ్లూకోజ్‌ అందకపోతే కణ విభజన జరగదని, ఫలితంగా శరీరంలో కరోనా వ్యాప్తి ఆగిపోతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాగా.. ఈ ఔషధానికి డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో దీని తయారీకి మరో మూడు, నాలుగు సంస్థలకు అనుమతినివ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this