Horoscope 31-5-2021: మే చివరి రోజు రాశి...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Horoscope 31-5-2021: మే చివరి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Horoscope today 31-5-2021: మే నెలలో ఇది చివరి రోజు. సంపూర్ణ చంద్రగ్రహణం ఈ నెలలో వచ్చింది. మరి చివరి రోజు ఎవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో, పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.

Horoscope 30-5-2021: రాశి ఫలాలు క్రమంగా శుభవార్తలను సూచిస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో బాగానే ఉన్నా.. ఆ తర్వాత రాశి ఫలాలు కొన్ని హెచ్చరికలు, సమస్యలు ఉంటాయని చెప్పాయి. దాంతో ప్రజలు అప్రమత్తం అయ్యారు. ఖర్చులు తగ్గించుకోమంటే… తగ్గించుకున్నారు. ప్రయాణాలు మానుకోమంటే… మానుకున్నారు. ఇక ఇవాళ ముగిసిపోతే… జూన్ వస్తుంది. అప్పుడు మళ్లీ సరికొత్త రాశి ఫలాలు వస్తాయి. గ్రహాల గమనాలు మారతాయి. మరి ఈ పరిస్థితుల్లో మే నెల చివరి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఏయే అంశాల్లో ఎవరికి ఎలా కలిసొస్తుంది? జ్యోతిష పండితులు ఏం సూచిస్తున్నారో తెలుసుకుందాం.
మేష రాశి (Aries) తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులతో హాయిగా గడుపుతారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులు తేలికగా లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.
వృషభ రాశి (Taurus) శుభకార్యాలకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. బంధుమిత్రులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగ విషయంలో ఆందోళన చెందుతారు. అప్పు తీసుకోవడానికి, ఇవ్వడానికి ఇది సమయం కాదు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. హామీలు ఉండొద్దు.
మిథున రాశి (Gemini) ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడి గలవారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆలయాలకు వెళ్తారు. ఇరుగు పొరుగు వారితో వివాదాలకు దిగవద్దు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారులు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.
కర్కాటక రాశి (Cancer) కుటుంబ సభ్యులతో హాయిగా కాలక్షేపం చేస్తారు. తలచిన పనులు నెరవేరుతాయి. చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త.
సింహ రాశి (Leo) ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి అనుకూలమైన సమాచారం అందుతుంది. భార్యాపిల్లలతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో విజయం సాధిస్తారు.
కన్య రాశి (Virgo) బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. చిన్ననాటి స్నేహితులు పలకరిస్తారు. శుభకార్యం తలపెడతారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగం విషయంలో అనుకూల సమాచారం అందుతుంది. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి.
తుల రాశి (Libra) ఇల్లు లేక స్థలం కొనుగోలు విషయంలో ఒప్పందం కుదర్చుకుంటారు. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధాలు కుదరవచ్చు. బంధువులకు సంబంధించిన ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి
వృశ్చిక రాశి (Scorpio) శుభకార్యం తలపెడతారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. వ్యాపారులకు అనుకూలంగా ఉంది. అవివాహితులకు పెళ్లి గంట మోగే సూచనలున్నాయి. దూరప్రయాణాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారం పెళ్లి వైపు అడుగులు వేస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త.
ధనస్సు రాశి (Sagittarius) ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వివాహ సంబంధం కుదరవచ్చు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఒక పాత ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు వెళ్తారు. వ్యాపారులు కష్టపడాల్సింది. కోర్టు కేసులో నెగ్గుతారు.
మకర రాశి (Capricorn) శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారులు కొద్దిగా కష్టపడినా ఫలితం ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవరికీ హామీలు ఉండొద్దు.
కుంభ రాశి (Aquarius) ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. రెండో ఆదాయ మార్గం గురించి స్నేహితులతో చర్చిస్తారు. అప్పులు తీరుస్తారు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారులు శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమలు ఫలిస్తాయి.
మీన రాశి (Pisces) ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి తరపు బంధువులతో బిజీ అవుతారు. వ్యాపారులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలున్నాయి. ఆర్థిక లావాదేవీలు పనికిరావు. స్నేహితులకు సంబంధించి దుర్వార్త వింటారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this